Smart phone addiction : స్మార్ట్‌ ఫోన్ అడిక్షన్.. అత్యధికమందిలో వ్యసనంగా మారిన దేశాలివే..

by Javid Pasha |
Smart phone addiction : స్మార్ట్‌ ఫోన్ అడిక్షన్.. అత్యధికమందిలో వ్యసనంగా మారిన దేశాలివే..
X

దిశ, ఫీచర్స్: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చాక మనిషి జీవన విధానంలోనూ చాలా మార్పు వచ్చింది. ముఖ్యంగా ఇప్పుడు స్మార్ట్ ఫోన్ లేనిదే రోజు గడవడం లేదు. ఏడెనిమిదేండ్ల పిల్లల నుంచి 80 ఏండ్ల వృద్ధుల వరకు ఫోన్లలో మునిగితేలుతున్నారు. అయితే అధిక వినియోగం మానసిక, శారీరక ఆరోగ్యాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని గత అధ్యయనాలు హెచ్చరించాయి. కానీ తాజా అధ్యయనం మరో కొత్త విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. ఏంటంటే. కొన్ని దేశాల్లో అత్యధికమంది ప్రజలు తమకు తెలియకుండానే స్మార్ట్‌ఫోన్‌కు బానిసలుగా మారిపోతున్నారని మెక్ గిల్ యూనివర్సిటీ స్టడీలో వెల్లడైంది. ఆ దేశాలేవో ఇప్పుడు చూద్దాం.

అధ్యయనం ప్రకారం.. వరల్డ్ వైడ్‌గా అత్యధిక మంది స్మార్ట్‌ఫోన్‌కు బానిసలైన దేశాల్లో చైనా ఫస్ట్‌ప్లేస్‌లో ఉండగా, సౌదీ అరేబియా సెకండ్ ప్లేస్, మేలేషియా థర్డ్ ప్లేస్, బ్రెజిల్, సౌత్ కొరియాలు 4, 5 స్థానాల్లో ఉన్నాయి. ఇక 6వ స్థానంలో ఇరాన్, 7వ స్థానంలో కెనడా, 8వ స్థానంలో టర్కీ, 9వ స్థానంలో ఈజిప్ట్, 10వ స్థానంలో నేపాల్ ఉన్నాయి. కాగా స్మార్ట్ ఫోన్లకు బానిసలవుతున్న ఈ టాప్ 10 దేశాల్లో ఇండియా మాత్రం లేదు. కానీ స్మార్ట్ ఫోన్ల వినియోగంలో మాత్రం 17వ స్థానంలో ఉంది.

కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ అవసరమే. కానీ ప్రస్తుతం అంతకుమించి వినియోగించుకుంటున్నారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వీడియోలు, రీల్స్ స్క్రోల్ చేయడం, క్రియేట్ చేయడం, సోషల్ మీడియాలో నిమగ్నం కావడం, ఎంటర్టైన్మెంట్ పేరుతో గంటల తరబడి ఫోన్లలో గడపడం, అన్‌సీన్ కంటెంట్‌ వీక్షణ వంటివి కూడా జరుగుతున్నాయి. అయితే ఈ తరహా వినియోగం మరీ ఎక్కువైపోవడంవల్ల కొందరిలో స్మార్ట్ ఫోన్ వినియోగం వ్యసనంగా మారుతోంది. ఒక విధంగా కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పరంగా చాలా మేలుగు జరుగుతోందని, అదే క్రమంలో స్మార్ట్‌ఫోన్‌ను వినియోగించుకునే తీరును బట్టి కొందరిలో వ్యసనానికి కారణం అవుతుందోని నిపుణులు చెప్తున్నారు. కాబట్టి మంచికోసం వినియోగించుకోవాలని సూచిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed