Skin Health: యవ్వనంగా మెరిసిపోవాలా?.. వీటికి దూరంగా ఉండాలంటున్న నిపుణులు

by Javid Pasha |
Skin Health: యవ్వనంగా మెరిసిపోవాలా?.. వీటికి దూరంగా ఉండాలంటున్న నిపుణులు
X

దిశ, ఫీచర్స్ : కొందరు 40 ఏండ్ల వయస్సులోనే 20 ఏండ్ల వ్యక్తిలా కనిపిస్తుంటారు. ముఖంలో యవ్వన ఛాయ ఉట్టిపడుతూ ఉంటుంది. ఇంకొందరు 25 ఏండ్లకే 40 ఏండ్ల వ్యక్తిలా కనిపిస్తుంటారు. ముఖంలో వృద్ధాప్య ఛాయలు దర్శనమిస్తుంటాయి. అయితే జన్యుపరమైన అంశాలు, ఆహారపు అలవాట్లు కూడా ఇందుకు కారణం అవుతుంటాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఎక్కువ ఏజ్ వచ్చినా తక్కువ ఏజ్ వ్యక్తిలా యవ్వనంగా కనిపించాలంటే.. కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. అవేంటో చూద్దాం.

* అధిక చక్కెర, శుద్ధి చేసిన ఆహారాలు : కృత్రిమ చక్కెరలు, అలాగే అధిక చక్కెరలు కలిగిన ఆహారాలు తరచుగా తినడంవల్ల చర్మంలో వృద్ధాప్య ఛాయలు త్వరగా కనిపించే అవకాశం ఉటుందని నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే ఈ అవాటు రక్తంలో షుగర్ లెవల్స్ పెంచుతుంది. ఎప్పుడైనా అది పెరుగుతుందో వృద్ధాప్య ఛాయలు చర్మంపై కనిపించడం మొదలవుతాయి. కాబట్టి అధిక చక్కెరలకు దూరంగా ఉండటం బెటర్.

* ఆల్కహాల్ వద్దు : మద్యపానం అలవాటు ఉన్నవారిలో మిగతా వారితో పోల్చినప్పుడు వృద్ధాప్యం త్వరగా వచ్చే చాన్సెస్ ఉంటాయని నిపుణులు అంటున్న మాట. ఎందుకంటే ఇది డెడ్ స్కిన్ సెల్స్‌ను పెంచుతుంది. తరచుగా చర్మాన్ని డీహైడ్రేషన్ పరిస్థితిలోకి నెడుతుంది. ఇది వేగవంతమైతే చిన్న వయస్సులో కూడా వృద్ధాప్య ఛాయలు కనిపిస్తాయి. ఎక్కువకాలం యవ్వనంగా ఉండాలంటే మద్యపానం అలవాటు మానుకోవాలని నిపుణులు పేర్కొంటున్నారు.

*ప్రాసెస్ చేసిన స్నాక్స్: అధిక చక్కెరలు కలిగిన, అధికంగా వేయించిన ప్యాకేజ్డ్ అండ్ ప్రాసెస్డ్ స్నాక్స్ వల్ల కూడా బ్లడ్‌లో షుగర్ లెవల్స్ పెరుగుతాయి. ముఖంపై యవ్వన ఛాయలు త్వరగా మాయం అవుతాయి. వృద్ధాప్యం త్వరగా వస్తుంది. కాబట్టి వాటిని అవైడ్ చేయండి.

* హెల్తీ ఫ్యాట్స్ : కొన్ని రకాల కొవ్వు పదార్థాలు వృద్ధాప్య ఛాయలను పెంచుతాయి. ఆయిలీ ఫుడ్స్, అధికంగా వేయించిన పదార్థాల్లో బ్యాడ్ కొలెస్ట్రాల్ లేదా హై కొలెస్ట్రాల్ ఉంటుంది. వీటిని అవైడ్ చేస్తూ గుడ్ కొలెస్ట్రాల్ ఉండే తాజా పండ్లు, కూరగాయలు, గింజలు, అవకాడో వంటివి ఆరోగ్యకరమైన కొవ్వులను తీసుకోవడంవల్ల ఏజింగ్ లక్షణాలు ఆలస్యం అవుతాయి. అలాగే సమతుల్యమైన ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం, అధిక కెఫిన్‌కు, మానసిక ఒత్తిడికి దూరంగా ఉండటం వంటివి చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వృద్ధాప్య ఛాయలను ఆలస్యం చేస్తాయి. చర్మంలో యవ్వన ఛాయను ప్రేరేపిస్తాయి.

*గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story