Research : భూమిపై నుంచి మనుషులు కనుమరుగవుతారా.. కొత్త పరిశోధనలు ఏం చెబుతున్నాయి..

by Sumithra |   ( Updated:2024-08-29 04:00:08.0  )
Research : భూమిపై నుంచి మనుషులు కనుమరుగవుతారా.. కొత్త పరిశోధనలు ఏం చెబుతున్నాయి..
X

దిశ, వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డెస్క్ : మనుషులు లేని ఈ భూమిని ఊహించగలరా ? భూమి పై స్త్రీలు మాత్రమే జీవించడం సాధ్యమేనా. అవుననే తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. కొంతమంది శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనం ప్రకారం వేగంగా తగ్గుతున్న వై క్రోమోజోమ్ వల్ల భవిష్యత్తులో మానవ జాతికి పెను ముప్పు వాటిల్లుతుందని స్పష్టం చేశారు. వాస్తవానికి X, Y అనేవి రెండు క్రోమోజోమ్‌లు పిల్లల లింగాన్ని నిర్ణయిస్తాయి.

కొన్ని పరిశోధనల ప్రకారం పురుషుల లింగాన్ని నిర్ణయించే ఈ Y క్రోమోజోమ్‌లు వేగంగా అదృశ్యమవుతున్నాయంటున్నారు శాస్త్రవేత్తలు. దీని వల్ల భవిష్యత్తులో పురుష కులం ఇబ్బందుల్లో పడుతోందని చెబుతున్నారు. ఇది క్రమంగా అంతరించిపోతే లేదా అదృశ్యమైతే అప్పుడు మగ జాతులు భూమి నుండి అంతరించిపోతాయని చెబుతున్నారు. అంటే భవిష్యత్తులో ఆడపిల్లలు మాత్రమే బతుకుతారు. దీంతో పునరుత్పత్తి ప్రక్రియ ముగుస్తుందా లేదా ఇతర యంత్రాంగాలు, పునరుత్పత్తి పద్ధతులు అభివృద్ధి చెందుతాయా అనేది ప్రశ్నార్థకం.

Y క్రోమోజోమ్ అదృశ్యమవుతుందా ?

ఈ పరిశోధన చేసిన ప్రొఫెసర్ జెన్నీ గ్రేవ్స్ ప్లాటిపస్‌లో XY క్రోమోజోమ్‌లు ఒకేలా ఉంటాయని ప్లాటిపస్ ఉదాహరణతో వివరించడానికి ప్రయత్నించారు. అంటే కొంతకాలం క్రితం వరకు ప్రతి క్షీరదంలోని X, Y క్రోమోజోములు ఒకేలా ఉండేవి. కానీ మానవులు, ప్లాటిపస్‌లు విడిపోయిన గత 160 మిలియన్ సంవత్సరాలలో Y క్రోమోజోమ్ 900 నుండి 55 ముఖ్యమైన జన్యువులను కోల్పోయిందని చెబుతున్నారు. అంటే ప్రతి 10 లక్షల సంవత్సరాలకు Y క్రోమోజోమ్‌లు 5 జన్యువులను కోల్పోతున్నాయని చెబుతున్నారు. ఇదే వేగంతో కొనసాగితే రాబోయే 110 లక్షల సంవత్సరాలలో Y క్రోమోజోములు భూమి నుంచి పూర్తిగా అదృశ్యమవుతాయంటున్నారు.

భూమి పై మనుషులు ఉండరా ?

ప్రొఫెసర్ గ్రేవ్స్ కూడా భవిష్యత్తులో కొత్త లింగ - నిర్ధారణ జన్యువు మానవులలో అభివృద్ధి చెందే అవకాశం ఉందని వెల్లడించారు. అయితే ఇది అంత సులభం కాదు. ఎందుకంటే కొత్త లింగాన్ని నిర్ణయించే జన్యువు కూడా జన్యువులుగా పెరిగి పరిణామం చెందుతాయి. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలైన లింగాన్ని నిర్ణయించే జన్యువులు ఉద్భవించి ఉండవచ్చు. ఇది జరిగితే 110 మిలియన్ సంవత్సరాల తర్వాత భూమిపై మానవులు ఉండకపోవచ్చు లేదా అనేక రకాల మానవులు ఉండొచ్చంటున్నారు. ఇందులో మగ, ఆడ మినహా ఇతర లింగాలు కూడా ఉన్నాయి.

* గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహనకోసం మాత్రమే అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు ‘దిశ’ బాధ్యత వహించదు.

Advertisement

Next Story