అంగారక గ్రహంపై వింత ఆకారాలు.. పరిశోధనలో బయటపడ్డ అసలు రహస్యమిదే..

by Javid Pasha |   ( Updated:2024-04-30 12:31:28.0  )
అంగారక గ్రహంపై వింత ఆకారాలు.. పరిశోధనలో బయటపడ్డ అసలు రహస్యమిదే..
X

దిశ, ఫీచర్స్ : ఓ వైపు అంతరిక్ష పరిశోధనలు కొనసాగుతున్నా, మరోవైపు అంతు పట్టని విషయాలు కూడా ఎప్పటికప్పుడు వెల్లడవుతూ మనల్ని ఆశ్చర్య పరుస్తుంటాయి. కొన్నిసార్లు అసలు విషయం తెలిసి.. ఓష్ ఇంతేనా! అనిపిస్తూ ఉంటుంది. మరికొన్ని సార్లు ఇంత గొప్ప రహస్యాన్ని తెలుసున్నామా.. అని సంతోష పడుతుంటాం. ఏది ఏమైనా కొంగ్రొత్త విషయాలు తెలుసుకోవడంలో ఉండే ఉత్సుకతే వేరు. అలాంటి మరో అంశంతో మన ముందుకు వచ్చారు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ పరిశోధకులు. అంగారక గ్రహంపై ఏదో వింత ఆకారం కనిపించిందని వారు రీసెర్చ్ చేయగా అసలు విషయం బయట పడింది. అదేంటో చూద్దామా మరి.

పరిశోధనల్లో భాగంగా శాస్త్రవేత్తలు ‘ఎక్సో‌ మార్స్ ట్రేస్ గ్యాస్ ఆర్బిట్’ అనే ఉపగ్రహాన్ని అంగాకర గ్రహంపైకి ఫోకస్ చేశారు. ఈ సందర్భంగా వారికి మార్స్‌పై దక్షిణ ధ్రువ భాగంలో ఏవో వింత ఆకారాలు పరుగెడుతున్నట్లు కనిపించాయి. దీంతో ఆశ్చర్యపోయిన సైంటిస్టులు అవేమిటో తెలుసుకునేందుకు సరికొత్త టెక్నాలజీతో శాటిలైట్ ఇమేజెస్‌ను విశ్లేషించగా అసలు విషయం బయట పడింది. అదేంటంటే.. అంగారక గ్రహంపై నేల పొరల దిగువన ఉన్న కార్బన్ డయాక్సైడ్ ఒక్కసారిగా వేడెక్కి గ్యాస్‌గా మారిందని, వేసవి ప్రభావం లేదా వేడి వాతావరణానికి ఈ గ్యాస్ తీవ్రమైన ఒత్తిడికి గురై పేలిపోయిందని గుర్తించారు.

అయితే ఇలా జరగడంవల్ల అంగారకుడిపై గల నేలలోంచి నల్లటి ఆకారంలో గల పెద్ద పెద్ద మట్టి పెళ్లలు ఎగిసి పడుతుంటాయని, ఇవి సుమారు 50 మీటర్ల నుంచి ఒక కిలో మీటర్ విస్తీర్ణంలో ఉండి, చూడటానికి వింత ఆకారాల్లా కనిపిస్తాయని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ముఖ్యంగా అవి ఉపగ్రహ చిత్రాల్లో స్పైడర్ల (సాలె పురుగులు) మాదిరి కనిపిస్తున్నట్లు వెల్లడించారు. ప్రతీ సంవత్సరం అంగారకుడిపై వేసవి కాలంలో తీవ్రమైన వేడి తావరణంవల్ల ఈ పరిణామాలు సంభవిస్తుంటాయని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన తాజా ఫొటోలను కూడా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed