పురుగులమందు వేస్తే రంగులు మారుస్తున్న మొక్క..

by Sujitha Rachapalli |   ( Updated:2024-06-02 15:30:15.0  )
పురుగులమందు వేస్తే రంగులు మారుస్తున్న మొక్క..
X

దిశ, ఫీచర్స్: సైంటిస్టులు సరికొత్త మొక్కను తయారు చేశారు. ఇది బ్యాన్ చేయబడిన లేదా విషపూరితమైన పురుగు మందులు వేస్తే వెంటనే కలర్ చేంజ్ అయిపోతుంది. గ్రీన్ నుంచి రెడ్ లోకి మారిపోతుంది. అంటే ఆ చోట కాలుష్య కారకాలు ఎక్కువగా ఉన్నాయని మనుషులను హెచ్చరిస్తుంది. అయితే ఈ ప్లాంట్ ఇంజినీరింగ్ ఇంకా మొదటి దశలోనే ఉండగా.. దీన్ని పురోగతిగా అభివర్ణిస్తున్నారు కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు.

ఇదంతా ఎలా సాధ్యం అయిందంటే మొక్క జీవక్రియను సవరించకుండా ఎన్విరాన్మెంటల్ సెన్సార్ క్రియేట్ చేశామని చెప్తున్నారు. ఈ ప్రక్రియ అంతా అబ్సిసిక్ యాసిడ్ (ABA)అనే ప్రోటీన్‌తో ప్రారంభమైంది. ఈ ప్రోటీన్ మొక్కలు తమ వాతావరణంలో ఒత్తిడితో కూడిన మార్పులకు అలవాటుపడటానికి సహాయపడుతుంది. ఉదాహరణకు, కరువు సమయంలో అనేక మొక్కలు ABA ను ఉత్పత్తి చేస్తాయి. అదనపు ప్రోటీన్లు అయిన రిసెప్టర్స్.. మొక్క ABAని గుర్తించడానికి, ప్రతిస్పందించడానికి సహాయపడతాయి. ఈ ప్రక్రియలు నీటి బాష్పీభవనాన్ని తగ్గించడానికి మొక్క దాని ఆకులు, కాండంలోని రంధ్రాలను మూసివేయమని చెబుతాయి. తద్వారా మొక్క వాడిపోయే అవకాశం తక్కువగా ఉంటుంది. కాగా ఇక్కడ రిసెప్టర్స్ ను ABA కాకుండా కెమికల్ ను బైండ్ చేసేలా చర్యలు తీసుకున్నారు. దీంతో ఒక్కసారి కెమికల్ ను బైండ్ చేశాయంటే మొక్క రంగు మారేలా తీర్చిదిద్దారు.

Advertisement

Next Story

Most Viewed