సైడ్ ఎఫెక్ట్స్‌‌ నివారణకు కొత్త మెడికేషన్‌‌ను కనుగొన్న సైంటిస్టులు

by Prasanna |   ( Updated:2023-04-18 14:30:36.0  )
సైడ్ ఎఫెక్ట్స్‌‌ నివారణకు కొత్త మెడికేషన్‌‌ను కనుగొన్న సైంటిస్టులు
X

దిశ, ఫీచర్స్: తరచూ యాంటీ బయాటిక్స్ వాడకంవల్ల మానవ శరీరంలో ఆరోగ్యానికి మేలు‌చేసే సూక్ష్మజీవుల సమూహాలు(microbial communities) దెబ్బతింటాయి. ఈ కారణంగా జీర్ణశయాంతర సమస్యలు పెరుగుతాయి. రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ పునరావృతం అవుతుంటాయి. అయితే ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు సైంటిస్టులు కొత్త మెడికేషన్స్‌ను కనుగొన్నారు. ఇతర ఔషధాల సామర్థ్యాన్ని ఏమాత్రం దెబ్బతీయకుండా కేవలం వాటి నుంచి ఎదురయ్యే దుష్ప్రభావాలు మాత్రమే వీటి ద్వారా నిరోధించవచ్చు. నేచర్ జర్నల్‌లో పబ్లిషైన స్టడీ ప్రకారం.. అత్యంత సాధారణ గట్ బ్యాక్టీరియా పనితీరుపై144 విభిన్న యాంటీ బయాటిక్‌ల ప్రభావాలను విశ్లేషించిన సైంటిస్టులు డెన్మార్క్‌లోని కోపెన్‌హాగన్‌లో జరిగిన ‘యూరోపియన్ కాంగ్రెస్ ఆఫ్ క్లినికల్ మైక్రోబయాలజీ & ఇన్ఫెక్షియస్ డిసీజెస్ (ECCMID)’ సమావేశంలో పూర్తి వివరాలను వెల్లడించారు. తాజా పరిశోధన ప్రకారం కొత్త మెడికేషన్ గట్ మైక్రోబయోమ్‌పై యాంటీబయాటిక్ ప్రతికూల ప్రభావాలను తగ్గించడంలో ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందని మాక్స్-డెల్‌బ్రక్-సెంటర్ ఫర్ మాలిక్యులర్ మెడిసిన్‌కు చెందిన ఉల్రిక్ లోబర్ వెల్లడించారు.

1,197 ఔషధాల విశ్లేషణ

మానవ ప్రేగులలో ట్రిలియన్ల కొద్దీ సూక్ష్మజీవులు ఉంటాయి. ఇవన్నీ జీర్ణక్రియకు సహాయం చేయడం, జీవక్రియలకు పోషకాలను అందించడానికి దోహదం చేస్తాయి. హానికరమైన బ్యాక్టీరియా, వైరస్‌లను నిరోధించడానికి రోగనిరోధక వ్యవస్థతో కలిసి పనిచేస్తాయి. ఈ కారణంగానే మనుషులు ఆరోగ్యంగా ఉండగలుగుతారు. అయితే తరచూ యాంటీబయాటిక్స్ వాడటంవల్ల ఆరోగ్యానికి మేలు చేసే ఈ సూక్ష్మజీవుల సమూహాలు వీక్‌గా మారుతాయి. అందువల్ల శరీరంలోని జీవక్రియలు మందగించడం, లేదా అసమతుల్యత ఏర్పడటం జరుగుతుంది. క్లోస్ట్రిడియోయిడ్స్ డిఫిసిల్ ఇన్‌ఫెక్షన్స్(Clostridioides difficile infections) కూడా కలుగుతాయి. ఇవి తరచూ పునరావృతమయ్యే జీర్ణశయాంతర సమస్యలు తలెత్తేలా చేస్తాయి. వీటితోపాటు ఒబేసిటీ, అలర్జీలు, ఆస్తమా వంటి వ్యాధులకు, ఇతర క్రానిక్ డిసీజెస్‌కు దారితీస్తాయి. అయితే ఈ సమస్యను ఎదుర్కొనే ఉద్దేశంతో అంతర్జాతీయ పరిశోధకుల బృందం యాంటీ బయాటిక్స్‌తో ట్రీట్‌మెంట్స్ చేసిన తర్వాత ప్రేగులలో సాధారణంగా కనిపించే 27 విభిన్న బ్యాక్టీరియా జాతుల పెరుగుదలను క్రమ పద్ధతిలో విశ్లేషించింది. ఈ క్రమంలోనే సైంటిస్టులు ఎరిత్రోమైసిన్ (ఒక మాక్రోలైడ్), డాక్సీసైక్లిన్ (ఒక టెట్రాసైక్లిన్)లను 1,197 ఔషధాలతో కలిపి ఒక కొత్త మెడికేషన్‌ను రూపొందించారు. ఇది యాంటీ బయాటిక్స్ మెడిసిన్స్ లేదా ట్రీట్‌మెంట్స్‌వల్ల ఆరోగ్యానికి మేలు చేసే గట్ బ్యాక్టీరియా సమూహాలు(బ్యాక్టీరియోడ్స్ వల్గటస్, బ్యాక్టీరియోడ్స్ యూనిఫార్మిస్)నాశనం కాకుండా వాటిని రక్షించడానికి దోహదం చేస్తుందని పరిశోధకులు పేర్కొన్నారు.

Also Read..

భర్త ఎట్టి పరిస్థితుల్లో భార్యకు ఈ మూడు విషయాలు చెప్పకూడదంట.. అవి ఏమిటంటే?

Advertisement

Next Story

Most Viewed