రెండు చేతులు సరిపోవడం లేదా?.. శాస్త్రవేత్తలు మూడవ చేతిని కూడా క్రియేట్ చేశారు (వీడియో)

by Javid Pasha |
రెండు చేతులు సరిపోవడం లేదా?.. శాస్త్రవేత్తలు మూడవ చేతిని కూడా క్రియేట్ చేశారు (వీడియో)
X

దిశ, ఫీచర్స్ : ఏదైనా సందర్భంలో మీకు రెండుకంటే ఎక్కువ చేతులు ఉంటే బాగుండు అనిపించిందా? కానీ స్విట్జర్లాండ్‌కు చెదిన EPFL రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్‌లో వర్క్ చేస్తున్న పరిశోధకులకు మాత్రం అనిపించిందట. అందుకోసం వారు సాంకేతిక పరంగా మనిషి అదనంగా పనిచేయడానికి అచ్చం చేతుల మాదరిగానే వర్క్ చేసే పరికరాల తయారీపై ఫోకస్ చేశారు. తక్కువ సమయంలో మల్టీ టాస్కింగ్ వర్క్ కంప్లీట్ చేసేందుకు ధరించ గలిగే మూడవ చేతిని క్రియేట్ చేశారు. ముఖ్యంగా డయాఫ్రాగమ్ కండరాల కదలికల ద్వారా సులభంగా నియంత్రించగల బెల్లీ కంట్రోల్డ్ రోబోటిక్ థర్డ్ ఆర్మ్‌‌ని శాస్త్రవేత్తలు సృష్టించారు.

ఎలా చేశారంటే..

సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మనిషి ధరించగలిగే మూడవ చేతిని క్రియేట్ చేయడంలో భాగంగా పరిశోధకులు ముందుగా అనేక ప్రయోగాలు చేశారు. ముఖ్యంగా వినియోగదారులు రెండు ఎక్సోస్కెలిటన్-రకం చేతులపై హ్యాండిల్స్‌ను పట్టుకుని కూర్చున్నప్పుడు, వారి కదలికలను గుర్తించేలా ధరించగలిగే సెన్సార్-అమర్చిన బెల్ట్‌ రిగ్ క్రియేట్ చేశారు. ఈ సదర్భంలో వారు దాని వర్చువల్ ఎన్విరాన్ మెంట్‌ను కూడా వీక్షించారు. ఎక్సోస్కెలిటన్ ఆర్మ్స్ మూవ్ చేయడం ద్వారా అది ధరించిన వినియోగదారులు వాటిని తమ నిజమైన చేతలుగా ఫీలవుతూ వర్చువల్ వెర్షన్‌లతో విధులను నిర్వహించడం సాధ్యమైంది. మరో విషయం ఏంటంటే.. ఇక్కడ డయాఫ్రాగమ్‌ను స్పెసిఫిక్ మ్యానర్స్‌లో మూవ్ చేయడం వర్చువల్ థర్డ్ ఆర్మ్‌ని కూడా నియంత్రించగలరు. దీంతో యూజర్లకోసం వర్చువల్ మోడ్‌లో ఎడమ మరియు కుడి చేతుల మధ్య ఉన్న ఆ మూడవ చేయి ఆరు-వేళ్ల చేతితో రూపొందించబడింది. దానికి ఇరువైపులా బొటనవేలు ఉంటుంది. కనుక ఇది ఒక వైపు లేదా మరొక వైపునకు చెందినదిగా భావించబడదు.

150 సెషన్లలో కంప్లీట్

ధరించ గలిగే మూడవ చేతిని క్రియేట్ చేయడానికి పరికశోధకులు 150 సెషన్లలో 61 మంది వాలంటీర్లు దానిని వినియోగించడాన్ని పరీక్షించారు. ముఖ్యంగా టెస్ట్ సబ్జెక్ట్స్ ఏకకాలంలో మూడవ చేతిని నియంత్రిస్తూ ఎడమ మరియు కుడి చేతులను నియంత్రించగలిగారు. అదే సమయంలో మూడవ చేయితో తలని తట్టడం, కడుపుపై నిమరడం, వివిధ పనులు చేయడం వంటి విషయాలను అబ్జర్వ్ చేశారు. ఇక లాస్ట్ సెషన్‌లో రీసెర్చర్స్ వాలంటీర్ల పొట్టపై భాగంలో కొత్తగా టెక్నాలజీ యూజ్ చేసి తయారు చేసిన రోబోటిక్ చేయిని అమర్చారు. ఇది అద్భుతంగా పనిచేసింది. అయితే స్విట్జర్లాండ్‌ పరిశోధకులు తయారు చేసిన ఈ రోబోటిక్ థర్డ్ ఆర్మ్ నియంత్రణ, మోటివేషన్ అనేది ప్రధానంగా నాడీ వ్యవస్థను అర్థం చేసుకుని స్పందిస్తుందని, మెదడుకు సమాచారం అందించడంలోనూ కీ రోల్ పోషిస్తుందని పరిశోధకులు చెప్తున్నారు. దీనిని మార్కెట్లో ప్రవేశ పెట్టే విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని, త్వరలో అది జరగవచ్చని పేర్కొంటున్నారు.

Advertisement

Next Story