వేడెక్కుతున్న భూ వాతావరణం.. వారానికి రెండు టన్నుల మంచుతో చల్లబరిచేందుకు నాసా చేస్తున్న ప్లాన్ ఇదే..

by Javid Pasha |   ( Updated:2024-03-02 08:23:03.0  )
వేడెక్కుతున్న భూ వాతావరణం.. వారానికి రెండు టన్నుల మంచుతో చల్లబరిచేందుకు నాసా చేస్తున్న ప్లాన్ ఇదే..
X

దిశ, ఫీచర్స్ : ఇటీవల పర్యావరణంలో వస్తున్న ప్రతికూల మార్పులు సైంటిస్టులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. వనరుల దుర్వినియోగం, వాతావరణ కాలుష్యం, శిలాజ ఇంధనాలను అధికంగా కాల్చడం, అటవీ నిర్మూలన వంటి మానవ కార్యకలాపాల కారణంగా భూ ఉపరితల ఉష్ణోగ్రలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇవి గ్లోబల్ వార్మింగ్‌కు దారితీస్తున్నాయి. అయితే ఇప్పుడు శాస్త్రవేత్తలు వేడెక్కుతున్న భూమిని చల్లబరచడానికి కొత్త మార్గాన్ని కనుగొన్నారు. వాతావరణంలో నీటి ఆవిరి మొత్తాన్ని (గ్రీన్ హౌస్ వాయువులు) తగ్గించడం ద్వారా భూ ఉపరితల వాతావరణాన్ని చల్లబరడానికి ప్రయత్నిస్తున్నారు.

వాస్తవానికి నీటి ఆవిరి భూమి యొక్క గ్రీన్‌హౌస్ ప్రభావాలలో అతి శక్తివంతమైనది. ఇది ప్లానెట్ వేడెక్కడాన్ని తీవ్రతరం చేసే క్లిష్టమైన యాంప్లి ఫయ్యర్‌గా పనిచేస్తుంది. నాసా ప్రకారం.. గ్రీన్‌హౌస్ వాయువులు లేకుంటే గనుక భూ ఉపరితల ఉష్ణోగ్రతలు దాదాపు 59 డిగ్రీల ఫారెన్‌హీట్ (33 డిగ్రీల సెల్సియస్) వరకు చల్లగా ఉంటాయి. కానీ ఇప్పుడా పరిస్థితి లేకుండా పోయింది. అందుకే నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ సైంటిస్టులు, నాసా పరిశోధకులు కలిసి భూమికి 17 కిలీమీటర్ల ఎత్తులోని వాతావరణంలోకి, హైటెక్ ప్లేన్లను ఉపయోగించి వారానికి రెండు టన్నుల చెప్పున ఐస్‌ను ఇంజెక్టును చేయాలని నిర్ణయించారు. దీనివల్ల గ్రీన్‌హౌస్ వాయువుల ప్రభావం తగ్గి వాతావరణం చల్ల బడుతుంది. భూ గోళానికి మేలు జరుగుతుంది. అయితే ఈ ప్రయోగానికి ముందు మరిన్ని పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

Read More..

న్యూజిలాండ్‌ అగ్నిపర్వత పేలుడు ఘటనలో బాధితులకు నష్టపరిహారంగా రూ.49.72 కోట్లు

Advertisement

Next Story