- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
జీవితకాల మజిలీకి సిద్ధమవుతున్న.. తప్పులు చేసి ఉంటే క్షమించండి.. సానియా మిర్జా
దిశ, ఫీచర్స్ : భారత టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ మధ్య ఈమె ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ముఖ్యంగా పాకిస్తాన్ క్రికేటర్ షోయబ్ మాలిక్‌ను పెళ్లి చేసుకొని, విడాకులు తీసుకున్న తర్వాత ఈమెకు సంబంధించిన ప్రతి న్యూస్ వైరల్ అవుతూనే ఉంటుంది.
ఇదిలా ఉండగా భర్త షోయాబ్ మాలిక్‌తో విడాకుల తర్వాత సానియ లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. అందుకు ఆమె ఇన్‌స్టాగ్రామ్ వీడియోలే సాక్ష్యం. ఒంటరితనాన్ని జయించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలో సానియా మానసికంగా బలాన్ని పుంజుకోవడానికి దైవ చింతనపై దృష్టి నిలిపింది. ముస్లిం పవిత్ర స్థలమైన హజ్ యాత్రకు వెళ్లనున్నట్లు తన ఇన్‌స్టా అకౌంట్ ద్వారా వెల్లడించింది. ఈ యాత్ర తర్వాత తాను మానసికంగా పరివర్తన చెంది తిరిగి రావాలనుకుంటున్నట్లు పోస్టులో తెల్పింది.
దీనిలో భాగంగా.. 'డియర్ ఫ్రెండ్స్, సన్నిహితుల్లారా.. మీకో న్యూస్. పవిత్రమైన హజ్ యాత్ర చేసే అవకాశం లభించింది. నేను పరివర్తన చెందేందుకు సిద్ధమవుతున్నాను. మీ పట్ల ఏమైనా తప్పులు చేసి ఉంటే క్షమించండి. ఈ ఆధ్యాత్మిక జర్నీ పట్ల నేను కృతజ్ఞతా భావంతో ఉన్నాను. అల్లా నా పొరపాట్లను క్షమించి.. ఈ ప్రయాణంలో నాకు తోడుగా ఉంటాడని నమ్ముతున్నా. జీవితకాల మజిలీకి సిద్ధమవుతున్న. నన్ను మీ ప్రార్థనలో గుర్తు చేసుకోండి. నేను మారిన హృదయం గల వ్యక్తిగా తిరిగొస్తానని ఆశిస్తున్నా' అని సానియా తన పోస్ట్‌లో రాసుకొచ్చింది.