‘రస్క్’ తింటూ రిస్క్ తీసుకోకండి.. హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు?

by Anjali |
‘రస్క్’ తింటూ రిస్క్ తీసుకోకండి.. హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు?
X

దిశ, ఫీచర్స్: ఉదయం లేవగానే టీ తాగనిదే కొంతమంది పని స్టార్ట్ చేయరు. ఇటీవల రోజుల్లో.. రోజంతా 5, 6 సార్లు టీ తాగే మహానుభావులు కూడా ఉన్నారు. అయితే కొంతమంది టీ లో స్నాక్స్‌గా బిస్కెట్స్, బ్రెడ్ అండ్ రస్క్‌లు తీసుకుంటారు. టీ లో బ్రెడ్, బిస్కెట్లు ముంచుకుని తింటే ఎలాంటి ప్రమాదం లేదు కానీ.. రస్క్‌ టీ తో పాటు తీసుకుంటే మాత్రం రిస్క్‌లో పడతారంటూ తాజాగా వైద్య నిపుణులు చెబుతున్నారు.

రస్క్ తింటే ఫుడ్ పాయిజనింగ్ వస్తుందని నిపుణులు అంటున్నారు. దీంతో పాటు డయేరియా, మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయి. తరచూ టీ లో రస్క్‌ తినేవారికి మాత్రం అనేక నష్టాలు వాటిల్లుతాయని చెబుతున్నారు. ఎందుకంటే రస్క్ తయారు చేసేటప్పుటు శుభ్రత పాటించకపోవడంతో పాటు నాణ్యతలేని మెటీరియల్స్ ఉపయోగిస్తున్నారు. దీంతో ఫుడ్ పాయిజనింగ్, డయేరియా, మలబద్ధకం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. రస్క్‌లు బొంబాయి రవ్వ, మైదా పిండితో తయారు చేస్తారు. కాబట్టి రస్క్ తిన్నాక జీర్ణం కావడానికి చాలా టైమ్ పడుతుంది. దీంతో బరువు పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి.

అలాగే రంగు కోసం రస్క్ క్యారామెల్ అనే ఫుడ్ కలరింగ్‌ను వాడుతారు. ఈ కలర్ అనేది ఆరోగ్యానికి చాలా హానికరం. ఇవి ఎక్కువ కాలం పాటు నిల్వ ఉండేలా పలు రసాయనాలను వాడుతారు. నాణ్యత లేని నెయ్యి, నూనెలను ఉపయోగించడం వల్ల భవిష్యత్తులో హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం ఉంది. అలాగే రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టడం, చిన్న ప్రేగు దెబ్బతినడం, మధుమేహం, అల్సర్లు, గ్యాస్ ప్రబ్లమ్.. వంటి సమస్యలు తలెత్తుతాయి. పైగా రస్క్‌లో చక్కెర ఎక్కువ మోతాదులో వాడుతారు. దీంతో షుగర్ లెవల్స్ పెరుగుతాయి. కాగా రస్క్‌లు అతిగా తినకపోవడం మంచిది. లేకపోతే ప్రమాల మీదకు తెచ్చుకున్న వారు అవుతారు.

Advertisement

Next Story

Most Viewed