- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కాలేయ వైఫల్యమా ?.. మనుషులకు పంది లివర్‌ను అమర్చవచ్చు !
దిశ, ఫీచర్స్ : మన దేశంలో చాలామందిని వేధిస్తున్న సమస్యల్లో కాలేయ వైఫల్యం ఒకటి. ఈ సందర్భంలో లివర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ చేస్తే తప్ప మనిషి బతికే అవకాశం ఉండదు. పైగా అలా చేయాలంటే లివర్ దానం చేసే దాత దొరకడం కూడా కష్టమే. కానీ మరో ఐదారేండ్లలో ఇటువంటి ఇబ్బందులు తొలగే అవకాశం ఉందంటున్నారు యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాకు చెందిన పరిశోధకులు. ప్రస్తుతం యూఎస్‌లో చాలామంది కాలేయమార్పిడి శస్త్ర చికిత్సకోసం ఎదురు చూస్తున్నారు. కానీ దాతలు దొరకడం లేదు. ఈ క్రమంలో ప్రత్యామ్నాయాలపై ఫోకస్ చేసిన రీసెర్చర్స్ పంది కాలేయం మానవులకు ఉపయోగించడంపై పరిశోధనలు నిర్వహించారు.
కాలేయ వైఫల్యం సంభవించిన వ్యక్తికి పిగ్ లివర్ అమర్చితే ఎటువంటి ఫలితం ఉంటుందో తెలుసుకోవడానికి పరిశోధకులు బ్రెయిన్ డెడ్ ఒక వ్యక్తి శరీరానికి పంది కాలేయాన్ని బాహ్యంగా కనెక్ట్ చేయగలిగారు. అయితే ఇది eGenesis నుంచి జన్యుపరంగా మార్పు చెందిన పిగ్ లివర్ కాబట్టి దానిని OrganOx డివైస్‌కు జోడించారు. అది రక్తాన్ని సక్సెస్ ఫుల్‌గా ఫిల్టర్ చేయడాన్ని గుర్తించారు. ఈ సరికొత్త ప్రయోగమే ప్రస్తుతం పరిశోధకుల్లో ఆశలు రేకెత్తిస్తోంది. జంతువుల నుంచి మనిషికి అవయవ మార్పిడికి మార్గం సుగమం చేస్తుందని రీసెర్చర్స్ భావిస్తున్నారు. ముఖ్యంగా పంది లివర్ మనిషికి అనేక రకాలుగా ఉపయోగపడుతుందని నమ్ముతున్నారు. కాగా ఇక్కడ పంది కాలేయాన్ని బయటి నుంచి మాత్రమే కనెక్ట్ చేసి పరిశీలించారు. కానీ వ్యక్తి శరీరంలో అమర్చ లేదు. దీనిపై మరిన్ని పరిశోధనలు, ప్రయోగాలు కూడా జరగాల్సి ఉందని పరిశోధకులు అంటున్నారు.