Morining Sleep : పగటి నిద్ర మంచిదేనా

by Sridhar Babu |   ( Updated:2023-06-23 10:43:52.0  )
Morining Sleep :  పగటి నిద్ర మంచిదేనా
X

దిశ, వెబ్​డెస్క్​ : మనలో చాలా మంది మధ్యాహ్నం అరగంటైనా కునుకుతీయకుండా ఉండలేరు. భోజనం చేయగానే కొద్దిసేపు అలా కునుకుతీస్తే ఎంతో రిలీఫ్​గా ఉంటుంది. మరి పగటి నిద్ర మంచిదేనా. అంటే పరిశోధనకులు మంచిదే అంటున్నారు. పగటిపూట కునుకు తీస్తే మెదడుకు ఎంతో మంచిదని లండన్​ పరిశోధనకులు చెబుతున్నారు. ఇలా నిద్రపోయే వారి మెదడు 15 క్యూబిక్ సెంటీమీటర్లు పెద్దదిగా ఉంటుందని వీరు నిరూపించారు కూడా. ఇలా రోజూ మధ్యాహ్నం నిద్రపోయే వారు త్వరగా ముసలివారు కారని తేల్చారు. ఇలా వారి జీవితకాలంలో మూడు నుంచి ఆరేళ్ల వరకు వయసు మీదపడటం తగ్గుతుందట. అంటే ముసలి వారు కావడం ఆరేళ్లు ఆలస్యం అవుతుందట.

అలాగని గంటల తరబడి నిద్రపోవడం కూడా మంచిది కాదు. అర్ధగంట నుంచి గంటలోను నిద్రపోతేనే పైన చెప్పిన లాభాలు కలుగుతాయి. అలాగే నిద్ర లేమితో మెదడు దెబ్బతింటుంది. మెదడు కణాల మధ్య ఆకర్షణపై కూడా ప్రభావం చూపుతుంది. పగటి నిద్రతో ఈ సమస్యల నుంచి దూరం కావచ్చు. కొద్ది సేపు కునుకు తీయడం 30 నిమిషాలు వ్యాయామం చేయడంతో సమానమట. ఆడవాళ్లు రోజుకో గంట అదనంగా నిద్రపోతే ఎంతో శక్తివంతంగా మారతారని పరిశోధనకులు తేల్చారు. ప్రతి ఒక్కరూ రోజుకు కనీసం ఆరు గంటలు నిద్రపోవాలి. ఇంతకంటే ఎక్కువైనా, తక్కువైనా ఆరోగ్యానికి మంచివి కాదు. తెలిసిందిగా ఇక ఇప్పటి నుంచి అవకాశం దొరికితే మధ్యాహ్నం అరగంట అలా కునుకు తీయండి.

Read more: సమయం దొరికినప్పుడల్లా నిద్రపోతున్నారా.. ఈ సమస్యలు వస్తాయి జాగ్రత్త?

Advertisement

Next Story