- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
WhatsApp నుంచి ఒక్క నిమిషంలో AIని తీసేయొచ్చు.. ఈ సింపుల్ సెట్టింగ్స్‌తో ఈజీ..
దిశ, ఫీచర్స్: వాట్సాప్‌లో కొత్త ఫీచర్ Meta AI యాడ్ అయింది. చాట్‌జిపిటి మాదిరిగానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారితమైన ఈ చాట్‌బాట్... మన ప్రశ్నలకు సమాధానమివ్వడం, మన ఆలోచనలకు రూపం ఇవ్వడం, ఇమేజ్ క్రియేట్ చేయడం వంటి చాలా విషయాల్లో హెల్ప్ చేస్తుంది. కానీ కొంత మంది వినియోగదారులు భద్రతా
పరంగా Meta AI చాట్‌బాట్‌పై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. WhatsApp పాత ఇంటర్‌ఫేస్ బాగుండేదని అంటున్నారు. ఇలాంటి వారి కోసమే కేవలం ఒక్క నిమిషంలో Meta AI చాట్‌బాట్‌ను ఎనేబుల్ లేదా డిసేబుల్ చేసే సెట్టింగ్స్ గురించి పూర్తి వివరాలు అందిస్తున్నాం.
1. మీ ఫోన్‌లో WhatsApp ఓపెన్ చేసి, రైట్ సైడ్ లో పైన ఉన్న మూడు చుక్కలపై క్లిక్ చేయండి.
2. ఇప్పుడు డ్రాప్-డౌన్ లిస్ట్ నుంచి 'సెట్టింగ్స్'
ఆప్షన్ ఎంచుకోండి. సెట్టింగ్స్ మెనులో 'చాట్స్' సెలెక్ట్ చేయండి.
3. చాట్ సెట్టింగ్ మెను ఓపెన్ అయ్యాక.. 'చాట్ బ్యాకప్'పై క్లిక్ చేయండి.
4. ఇప్పుడు మీ పాత WhatsApp చాట్‌లన్నింటినీ బ్యాకప్ చేయాలనుకుంటున్న Google ఖాతాను చూజ్ చేయండి.
5. చాట్ బ్యాకప్ పూర్తయిన తర్వాత, మీ ఫోన్ నుంచి WhatsApp అప్లికేషన్ ప్రస్తుత వెర్షన్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేయండి.
6. ఏదైనా బ్రౌజర్‌ని తెరిచి WhatsApp వెర్షన్ 2.24.8.4 వంటి WhatsApp పాత వెర్షన్ కోసం సెర్చ్ చేయండి.
7. WhatsApp పాత వెర్షన్‌ను డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేయండి.
8.పాత వెర్షన్ ఇన్‌స్టాల్ చేయబడిన తర్వాత, మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌తో లాగిన్ కావాలి. మీ బ్యాకప్ చేసిన చాట్‌లను రిట్రైవ్ చేయాలి. అంతే Meta AI చాట్‌బాట్ లేకుండా పాత WhatsApp వెర్షన్‌ని ఎంజాయ్ చేయండి.