- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మీకు కొత్తగా పెళ్లైందా.. ఫస్ట్ నైట్ కోసం ఈ విషయాలను గుర్తుంచుకోండి ..
దిశ, ఫీచర్స్ : పెళ్లయ్యాక తొలిరాత్రి అంటేనే కొత్త జంటలు చాలా ఎగ్జైట్ అవుతారు. కానీ ఆ ఉత్సాహంతో పాటు పెళ్లికూతురు మనసులో చాలా రకాల టెన్షన్స్ కూడా ఉంటాయి. తన భర్తను ఎప్పుడు కలుస్తానో, వారు ఎలా స్పందిస్తారో ఇలా అనేక విషయాలు వధువు మనస్సులో కదులుతూ ఉంటాయి. ఇలాంటి సమయంలోనే భాగస్వామి జీవితాంతం తనతో బాధ్యతగా ఉంటానని భరోసా ఇవ్వాలి. అలాగే వధువు కూడా తొలిరేయి నాడు కొన్ని విషయాలను మర్చిపోకుండా గుర్తుంచుకోవాలి. మరి అవేంటో తెలుసుకుందాం..
సెక్స్ పరిపూర్ణంగా లేకపోతే చింతించకండి..
నవదంపతులు ఫస్ట్ నైట్ ని జీవితంలో అత్యంత అందమైన రాత్రిగా మార్చుకోవాలి అనుకుంటారు. అయితే వధూవరుల మధ్య ఉన్న మొహమాటాలు, లేదా సెక్స్ కి కొత్త కావడంతో కాస్త అటూ ఇటుగా సంపూర్ణంగా సెక్స్ అనుభూతిని పొందలేరు. అలాంటి సమయంలో చింతించవలసిన అవసరం లేదు. మీకు వివాహమైంది, ఇద్దరూ జీవితాంతం కలిసి ఉండాల్సిన వారు కాబట్టి ఏదో తప్పు జరుగుతుందని ఎక్కువగా చింతించకండి.
కొన్ని ముఖ్యమైన వైద్య పరీక్షలు చేయించుకోవాలి..
వివాహానికి ముందు మీరు వైద్యుని సలహా పై కొన్ని పరీక్షలు చేయించుకోవాలి. తద్వారా లైంగికంగా సంక్రమించే వ్యాధులు (STD) లేదా ఇన్ఫెక్షన్‌ల సమస్యను ఎదుర్కొంటున్నారా అని తెలుసుకోవచ్చు. అంతే కాదు వైద్యులు ఇచ్చిన మెడికేషన్ తో సమస్య నుంచి బయటపడవచ్చు.
మీ భాగస్వామితో బహిరంగంగా మాట్లాడాలి..
నేటి కాలంలో పెళ్లికి ముందు వధూవరులు ఒకరితో ఒకరు ఫోన్‌లో మాట్లాడుకోవడం, ఒకరినొకరు కలుసుకోవడం చేస్తుంటారు. ఇలా చేయడం వలన ఇద్దరికీ మంచిదే అంటున్నారు నిపుణులు. ఎందుకంటే రిలేషన్ షిప్ లో కమ్యూనికేషన్ చాలా ముఖ్యం. ఇలా తరచూ మాట్లాడుతూ, కలుసుకుంటూ ఉంటే భయం, బిడియం దూరం అయ్యి సెక్స్ జీవితాన్ని సుఖంగా గడపవచ్చు.
మీ పీరియడ్స్ తేదీని గుర్తుంచుకోండి..
నవవధువులు పీరియడ్స్ తేదీని గుర్తుంచుకోవాలి. ఫస్ట్ నైట్ పీరియడ్ వచ్చే రోజులు వస్తున్నట్లయితే, మీరు తప్పనిసరిగా డాక్టర్‌ని సంప్రదించాలి. మీ పీరియడ్స్ తేదీని పొడిగించడానికి మందులు ఇస్తారు.