- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నవ్వుకు హీలింగ్ పవర్ ఉందా?.. కార్డియో వాస్క్యులర్ సమస్యలను కూడా నివారిస్తుంది.. ఎలాగంటే..
దిశ, ఫీచర్స్ : ఒకప్పుడు నవ్వు నాలుగు విధాల చేటు అనేవారు. కానీ తాజా పరిశోధనలు మాత్రం నవ్వు నాలుగు విధాల మేలు అంటున్నాయి. అంతేకాదు లాఫింగ్ అనేది వ్యక్తి ఆనందంగా, ఆరోగ్యంగా ఉండటానికి టానిక్‌లా పనిచేస్తుందని థెరపిస్టులు అంటుంటారు. దానికి గొప్ప హీలింగ్ పవర్ కూడా ఉందని, మానసిక రుగ్మతల నుంచి, గుండె జబ్బుల నుంచి రక్షిస్తుందని సైకాలజిస్టులు చెప్తున్నారు. పైగా మనిషిలోని సహజమైన నవ్వు గుండె కణజాల విస్తరణను ప్రేరేపిస్తుందని, శరీరం మొత్తానికి ఆక్సిజన్ సరఫరాను మెరుగు పరుస్తుందని యూఎస్‌కు చెందిన వైద్య నిపుణులు చెప్తున్నారు. నవ్వు కారణంగా ఒక వ్యక్తిలో 9 శాతం ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని అంటున్నారు.
హీలింగ్ పవర్ బెనిఫిట్స్ కలిగిస్తుంది కాబట్టి గుండె జబ్బుల లక్షణాలు కలిగిన వారికి లాఫింగ్ థెరపీని కూడా ఇటీవల నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. అయితే కరోనరీ ఆర్టరీ డిసీజ్‌తో బాధపడుతున్న వారిలో నవ్వు ఎటువంటి ప్రభావం చూపుతుందో తెలుసుకోవడానికి యూఎస్ నిపుణుల బృందం ఇటీవల 60 ఏండ్ల వయస్సుగల 28 మందిని స్టడీ చేసింది. వీరిని రెండు గ్రూపులుగా విభజించి 4 నెలలపాటు లాఫింగ్ థెరపీ అందించింది. కాగా ఇందులో ఒక గ్రూపు వారానికి రెండుసార్లు గంటసేపు కామెడీ యాక్టివిటీస్‌ను చూసేలా, మరొక గ్రూప్ పాలిటిక్స్ అండ్ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ వంటి సబ్జెక్ట్‌తో కూడిన డాక్యుమెంటరీలను చూసేలా నిపుణులు ఏర్పాటు చేశారు. అలా 12 వారాలు గడిచాక పాలిటిక్స్ గ్రూప్ కంటే కూడా, కామెడీ-వాచింగ్ గ్రూప్ వారి గుండె ఆరోగ్యంలో గణనీయమైన మెరుగుదల కనబడింది. ఇతర ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుముఖం పట్టాయి. ముఖ్యంగా వారు ఆనందంగా ఉండగలిగారు. అత్యధిక మందిలో కార్డియో వాస్క్యులర్ సిస్టమ్ ఫంక్షనల్ యాక్టివిటీస్ 9 శాతానికి పెరిగాయి. హార్ట్ ఎటాక్, పక్షవాతం, ఇతర రుగ్మతలు వచ్చే రిస్క్ తగ్గింది. దీంతో నవ్వుకు గొప్ప హీలింగ్ పవర్ ఉందని పరిశోధకులు నిర్ధారించారు.