రూ.200ల చీరలో నగలు లేకుండా పెళ్లి కూతురుగా రాధిక..పడుకునేందుకు దుప్పట్లు సర్దుతున్న ముఖేష్ అంబానీ!

by Jakkula Samataha |
రూ.200ల చీరలో నగలు లేకుండా పెళ్లి కూతురుగా రాధిక..పడుకునేందుకు దుప్పట్లు సర్దుతున్న ముఖేష్ అంబానీ!
X

దిశ, ఫీచర్స్ : అపర కుభేరుడు మఖేష్ అంబానీ ఇంట పెళ్లి సందడి గురించే ప్రపంచ వ్యాప్తంగా అందరూ ముచ్చటిస్తున్నారు. అతిరథ మహారథులందరూ ఈ పెళ్లికి హాజరు అవుతుండటం విశేషం. సినీ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు ఇలా ఎంతో మంది ఈ వివాహానికి హాజరవుతున్నారు. ఇక తన కుమారుడి వివాహానికి మేఖేష్ అంబానీ 5వేల కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ప్రీ వెడ్డింగ్, వివాహానికి చాలా ఖర్చు చేస్తున్నట్లు సమాచారం.

అయితే తాజగా వీరి పెళ్లిపై ఏఐ కొత్త మ్యాజిక్ చేసింది. ముఖేష్ అంబానీ ఫ్యామిలీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయితే అనంత్ అంబానీ,రాధికమర్చంట్‌ల వివాహం ఎలా జరిగేదో , వాళ్లు ఎలా ఉండేవారో ఓ క్రియేటర్ క్రియేట్ చేయగా ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

షాహిద్‌ ఎస్‌కే అనే మెగాలాడన్‌ క్రియేటివ్‌ టెక్‌ కంపెనీ హెడ్‌ ఏఐ ద్వారా అంబానీ ఇంటిపెళ్లి వేడుకని డిజైన్‌ చేశాడు . తాను ఆ ఫోటోలను షేర్ చేయగా, ప్రస్తుతం అవి తెగ వైరల్ అవుతున్నాయి. ఈ పిక్స్‌లో అంబానీ ఫ్యామిలీ చాలా మిడిల్ క్లాస్‌లా ఉంది. అంతే కాకుండా రాధిక మర్చంట్ చాలా సింపుల్‌గా , రూ.200ల చీర కట్టుకొని, కొన్ని నగలు మాత్రమే వేసుకొని దర్శనం ఇచ్చింది, ఇక అంబానీ వాళ్ల ఫ్యామిలీ కూడా చాలా తక్కువ ధర పెట్టి కొన్న దుస్తులు ధరించి చాలా సింపుల్‌గా కనిపించింది. అదే విధంగా పెళ్లి అయిపోయాక అంబానీ తన బంధువులకు పడుకోవడానికి దుప్పట్లు పట్టుకొని ఎలా ఏర్పాట్లు చేస్తారు లాంటి ఫన్నీ ఫోటోలను షేర్ చేయడంతో, ఇవి నెటిజన్స్‌ను ఎంతో ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed