- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రమోషన్ టు ఫాదర్‌హుడ్.. బిడ్డ పుట్టగానే జాబ్‌కు రిజైన్
దిశ, ఫీచర్స్ : ఐఐటీ, ఖరగ్‌పూర్ గ్రాడ్యుయేట్ అంకిత్ జోషి.. ఇటీవలే జన్మించిన కుమార్తెతో సమయం గడిపేందుకు తన హై పెయిడ్ శాలరీ జాబ్ వదిలి పెట్టినట్లు వెల్లడించాడు. సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా కొన్ని నెలల క్రితమే జాబ్ లో జాయిన్ అయినట్లు తెలిపిన జోషి.. కేవలం తన బిడ్డతో టైమ్ స్పెండ్ చేసేందుకే జాబ్ విడిచిపెట్టినట్లు హ్యూమన్స్ ఆఫ్ బాంబేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు.
ఇది విచిత్రమైన నిర్ణయమని జోషికి తెలుసు. కెరీర్‌లో ఇబ్బందులు ఎదురవుతాయని తనను చాలా మంది హెచ్చరించారు. అయినప్పటికీ అతడి భార్య ఆకాంక్ష తన నిర్ణయానికి మద్దతిచ్చింది. నిజానికి మిస్టర్ జోషి తన కొత్త ఉద్యోగం కారణంగా వివిధ నగరాలకు తరచూ వెళ్లాల్సి ఉంటుంది. కానీ కుమార్తె పుట్టిన తర్వాత అలా చేసేందుకు తను ఇష్టపడలేదు. 'స్పితి పుట్టాక నాకు ఎక్కువ విరామం కావాలి అనిపించింది. కంపెనీ నా సెలవును పొడిగించదని నాకు తెలుసు. అందుకే రిజైన్ చేశాను' అని తెలిపిన జోషి.. ఈ చర్యను ఫాదర్‌హుడ్‌కు ప్రమోషన్‌గా సమర్థించుకున్నాడు. కూతురి బాగోగులు చూసుకుంటున్న ఈ క్షణాలను ఆస్వాదిస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు.
ఇక స్పితి పుట్టి ఇప్పటికే నెల గడిచింది. మరోవైపు జోషి భార్య ప్రసూతి సెలవులో ఉన్నప్పటికీ ఆమె సంస్థలో మేనేజర్‌గా పదోన్నతి పొందింది. రెండింటిలోనూ ఆమె రాణిస్తున్న తీరు చూస్తుంటే కెరీర్, మాతృత్వం ఎంతో సంతృప్తిని కలిగిస్తోందన్నారు. ఇంకొన్ని నెలల తర్వాత కొత్త ఉద్యోగాల వేట మొదలు పెడతానని, ఈలోగా మొత్తం సమయం కూతురితో గడపాలని ప్లాన్ చేసుకున్నానని జోషి చెప్పాడు. అలాగే చాలా కంపెనీలు పితృత్వ సెలవులు ఎక్కువగా ఇవ్వకపోవడాన్ని ప్రస్తావిస్తూ.. ఈ విషయం తనను నిరుత్సాహపరుస్తుందని అన్నాడు. ఇలాంటి చర్యలు తండ్రి పిల్లలతో ఎంత తక్కువ అనుబంధాన్ని కలిగి ఉన్నారనే విషయంతో పాటు పెంపకం పాత్రలో తండ్రి బాధ్యతను తగ్గించడాన్నే ఎక్కువగా ప్రతిబింబిస్తాయని చెప్పాడు.
మొత్తానికి తాను వేసిన అడుగు అంత సులభం కాదు. చాలా మంది పురుషులు ఇలాంటి నిర్ణయం తీసుకోలేరు. కానీ రాబోయే సంవత్సరాల్లో పరిస్థితులు మారుతాయని జోషి ఆశిస్తున్నాడు. ఎందుకంటే గత నెలలో జోషి గడిపిన జీవితం.. తన ఇన్నేళ్ల హడావిడి కంటే మరింత సంతృప్తికరంగా ఉందని అభిప్రాయపడ్డాడు.
- Tags
- Lifestyle