Precious metals : బంగారంకంటే విలువైన లోహాలు ఇవే.. ఒక గ్రాము ధర ఎంతంటే..

by Javid Pasha |
Precious metals : బంగారంకంటే విలువైన లోహాలు ఇవే.. ఒక గ్రాము ధర ఎంతంటే..
X

దిశ, ఫీచర్స్ : ఈ ప్రపంచంలో విలువైన లోహం ఏదైనా ఉందంటే అది బంగారమే అనుకుంటారు చాలా మంది. దానికి ద్రవ్య వినమయ విలువ ఉంటుంది కాబట్టి ఎప్పటికైనా ఉపయోగపడుతుందని కొనడానికి ఇష్టపడుతుంటారు. అంతేకాకుండా వివిధ ఆభరణాల తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే గోల్డ్ కంటే విలువైన లోహాలు కూడా చాలానే ఉన్నాయని మీకు తెలుసా? పైగా వాటి ఖరీదు బంగారంకంటే కూడా ఎక్కువే. నిజానికి అత్యంత విలువైన లోహాల జాబితాలో బంగారం 10వ స్థానంలో ఉందంటున్నారు నిపుణులు. దీనికంటే ఖరీదైన మిగతా లోహాలేమిటో ఇప్పుడు చూద్దాం.

* ఫ్రాన్సియం : ఇది ప్రపచంలోనే అత్యంత ధర పలికే రేడియో ధార్మిక మూలకంగా నిపుణులు పేర్కొంటున్నారు. ఇక ఖరీదు విషయానికి వస్తే ఒక్కో గ్రాము సుమారు రూ. 8 కోట్ల వరకు ఉంటుంది. కాకపోతే దీని జీవితకాలం మాత్రం 22 నిమిషాలే. అంటే ఈ సమయం తర్వాత ఫ్రాన్సియం మరో లోహంగా రూపాంతరం చెందుతుంది. కాకపోతే ఇది వాడుకలో లేదు.

* కాలిఫోర్నియా : ఖరీదైనా లోహాల్లో మరొకటి ‘కాలిఫోర్నియా’ దీనిని మొట్ట మొదటిసారిగా 1950లో కాలిఫోర్నియా యూనివర్సిటీలో అభివృద్ధి చేసినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. నాటి నుంచి దీనిని కొన్ని గ్రాములు మాత్రమే ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఖరీదు విషయానికి వస్తే ఒక్క గ్రాము కాలిఫోర్నియా ధర రూ. 2.22 కోట్లు ఉంటుంది. కానీ కొనడం అంత సులువు కాదు. ఎందుకంటే ఏడాదికి అరగ్రాము మాత్రమే దీనిని ప్రొడ్యూస్ చేస్తున్నారట.

* కార్బన్ : ప్రస్తుతం అత్యధిక ధర పలికే మూలకాలలో కార్బన్ ఒకటి. ఇది జంతువులలో కూడా కనిపిస్తుందని చెప్తారు. అయితే ప్రస్తుతం డైమండ్ ఆకారంలో ఉండే ఒక గ్రాము కార్బన్ ధర రూ. 54 లక్షలకు పైమాటే.

* ప్లూటోనియం : అత్యంత రేడియో ధార్మికత కలిగిన మెటల్ ఇది. అణు విద్యుత్ ప్లాంట్లలో దీనిని ఉపయోగిస్తారు. అయితే దీనిని నిల్వచేయడం మామూలు విషయం కాదు. ఈజీగా మండే స్వభావం కలిగి ఉంటుంది. ప్రస్తుతం ఒక గ్రాము ప్లూటోనియం ధర రూ. 3.3 లక్షలు.

* స్కాండియం : అల్యూమినియం మిశ్రమాలపై ఈ లోహాన్ని ఉపయోగిస్తారు. మొట్ట మొదటిసారిగా 1970లలో దీనిని గుర్తించారు. అప్పటి నుంచి ఖరీదైన మూలకాలలో ఒకటిగా మారిపోయింది. ఈ మెటల్ ఒక గ్రాము ధర రూ. 22 వేలకు పైమాటే.

* లుటేటియం : ఆల్కలైజేషన్, హైడ్రోజనేషన్, పాలిమరైజేషన్ వంటి ప్రక్రియలలో లుటేటియం లోహాన్ని ఉపయోగిస్తారు. ఈ భూమిపై గల అరుదైన మెటల్స్‌లో ఇదొకటి. వాణిజ్య పరంగా తక్కువ వినియోగంలో ఉన్నప్పటికీ ధర మాత్రం ఒక గ్రాము రూ. 57,000 ఉంటుంది. పెట్రోల్ శుద్ధి కర్మాగారాల్లో దీనిని ఎక్కువగా ఉపయోగిస్తారు.

* ప్లాటినం : అధిక ఉష్ణోగ్రతల వద్ద కూడా తుప్పుపట్టని లోహం ఏదైనా ఉందంటే అది ప్లాటినం మాత్రమే. ఇది చాలా రియాక్టివ్ మెటల్. చాలా అరుదుగా లభిస్తుంది కాబట్టి డిమాండ్ ఎక్కువ. ఏటా కొన్ని వందల టన్నుల్లో మాత్రమే లభిస్తుంది. ఒక గ్రాము ప్లాటినం ధర రూ. 48, 000 చొప్పున ఉంటుంది.

* బంగారం : పరిచయం అవసరం లేని అత్యంత విలువైన లోహం బంగారం. నగలు, వివిధ ఆభరణాల తయారీకి ఉపయోగిస్తారు. ద్రవ్య వినిమయ విలువ కూడా ఉండటంవల్ల ప్రపంచ వ్యాప్తంగా దీనికి చాలా డిమాండ్ ఉంది. ప్రస్తుతం ఒక గ్రాము ధర రూ. 5,800 ఉంది. కాకపోతే ఇది డిమాండ్‌ను బట్టి పెరుగుతూ.. తగ్గుతూ ఉంటుంది.

Advertisement

Next Story

Most Viewed