- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డ్రై క్లీనింగ్ చేయించుకుంటున్నారా? అయితే రోగం కొనితెచ్చుకుంటున్నట్లే..
దిశ, ఫీచర్స్: ట్రై క్లోరో ఇథైలీన్ (TCE) అనేది ఒక ప్రముఖ పారిశ్రామిక రసాయనం. కాగా దీన్ని డ్రై క్లీనింగ్, పెయింట్‌లను తొలగించడం, మెషిన్స్ అండ్ ఎక్విప్‌మెంట్ క్లీనింగ్ కోసం ఉపయోగిస్తారు. అయితే ఈ కెమికల్‌కు ఎక్స్‌పోజ్ కావడం వలన పార్కిన్సన్స్ వ్యాధి వచ్చే అవకాశం ఉందని, అందుకే TCEపై నిషేధం విధించాలని అంతర్జాతీయ పరిశోధకుల బృందం కోరుతోంది. TCEతో కలుషితమైన నీరు, గాలికి బహిర్గతమైతే పార్కిన్సన్స్ డెవలప్ అయ్యే అవకాశం 500 శాతం ఎక్కువగా ఉందని హెచ్చరిస్తున్నారు. కాగా ఈ డిసీజ్‌తో బాధపడుతున్న ఏడుగురు రోగుల కేస్ స్టడీస్‌పై అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు.. ఈ విషయాన్ని వెల్లడించారు.
TCE యొక్క అధిక మోతాదు శరీరం, మెదడు కణాలలోని మైటోకాండ్రియాను దెబ్బతీస్తుంది, డోపమైన్ స్థాయిలలో పదునైన క్షీణతను తెస్తుందని, ఇది పార్కిన్సన్ లక్షణమని గత అధ్యయనం తెలిపింది. అయితే ప్రస్తుత అధ్యయన రచయితలు యుఎస్‌లో సైనిక సిబ్బందితో సహా ఎంత మంది వ్యక్తులు TCEకి గురయ్యారు, వారి ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేసిందో వెల్లడించారు. నార్త్ కరోలినాలోని U.S. మెరైన్ కార్ప్స్ బేస్ క్యాంప్ లెజ్యూన్‌లో తన బాల్యాన్ని గడిపిన మాజీ NBA ప్లేయర్ బ్రియాన్ గ్రాంట్ జీవితాన్ని ఇందుకు ఉదహరణగా వివరించారు.
అతను చైల్డ్‌హుడ్‌లో మెరైన్‌గా పనిచేస్తున్న తన తండ్రితో కలిసి అక్కడ నివసించాడు. ఈ శిబిరం అధిక TCE కాలుష్యం ఉన్న సైట్లలో ఒకటి అని పరిశోధకుల అభిప్రాయం. కాగా గ్రాంట్‌కు 2006లో పార్కిన్సన్స్ నిర్ధారణ అయింది. జార్జియా ఎయిర్ నేషనల్ గార్డ్‌లో చిన్న వయస్సులో పనిచేసిన మాజీ యూఎస్ పొలిటిషియన్ జానీ ఇసాక్సన్ కూడా 2015 నుంచి పార్కిన్సన్స్‌తో బాధపడుతున్నాడు. విమానాల డీగ్రేసింగ్ సమయంలో ఇసాక్సన్ అధిక స్థాయి TCEకి గురికావడమే ఇందుకు కారణమని పరిశోధకులు చెప్తున్నారు.
నేటికీ TCE, పెర్ క్లోరో ఇథైలీన్ ( PCE)లు డిగ్రేసింగ్ యంత్రాలు, డ్రై క్లీనింగ్‌కు అధికంగా ఉపయోగించబడుతున్నాయని తెలిపారు పరిశోధకులు. ఈ రసాయనం నేల, నీరు, గాలిని కలుషితం చేస్తుండగా.. మిలియన్ల మంది ప్రజలు ప్రతిరోజూ ఈ కెమికల్‌కు ఎక్స్‌పోజ్ అయ్యే అవకాశం ఉంది. తెలియకుండానే కలుషితమైన భూగర్భ జలాలు, అంతర్గత వాయు కాలుష్యం ద్వారా అనారోగ్యం పాలయ్యే చాన్స్ ఉంది.