- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
pine nuts : బంగారంకంటే విలువైన గింజలు.. తినడంవల్ల కలిగే బెనిఫిట్స్ తెలిస్తే అస్సలు వదలరు!
దిశ, ఫీచర్స్: ఆ గింజలు బంగారంకంటే విలువైనవి అంటుంటారు కొందరు. ఇక్కడ బంగారంతో పోల్చడమంటే అత్యంత ప్రయారిటీగా భావించడం అన్నమాట. చిల్గోజా గింజలను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఇలా పిలుస్తుంటారు. తరచుగా తీసుకుంటే సంతాన సామర్థ్యం పెరుగుతుందని, గుండె ఆరోగ్యం మంచిదని పోషకాహార నిపుణులు కూడా చెప్తున్నారు.
హెల్తీగా, టేస్టీగా ఉండే నట్స్ ఏవి అంటే చాలా మంది పిస్తా, బాదం, జీడిపప్పు వంటి పేర్లు చెప్తుంటారు. కానీ చిల్గోజా గింజల్లో అంతకు మించి బెనిఫిట్స్ ఉంటాయి. తినడానికి క్రీమీగా ఉండి, నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి. మంచి అనుభూతిని కూడా ఇస్తాయి. ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ధర కూడా ఎక్కువేనట. ఒక కిలో చిల్గోజా గింజల ధర రూ. సుమారు రూ. 8000 పలుకుతుందంట. ధర ఎక్కువైనా సరే ఏడాదికి కనీసం ఒక గ్రాము గింజలైనా తీసుకోవడం మంచిదని చెప్తుంటారు.
గుండె ఆరోగ్యానికి
చిల్గోజా గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. వంద గ్రాముల గింజల్లో 673 కేలరీలు, 13.69 గ్రాముల ప్రోటీన్లు ఉంటాయి. షుగర్ కంటెంట్ 3.59 గ్రాముల్లో చాలా తక్కువగా ఉంటుంది. అతేకాకుండా వంద గ్రాముల చిల్గోజాలో 251 మి.గ్రా మెగ్నీషియం, 16 మి. గ్రా కాల్షియం, 597 గ్రాముల పొటాషియం ఉంటాయి. ఇందులో ఐరన్, ఫోలేట్ వంటివి కూడా ఉండటంవల్ల గర్బిణులకు కూడా మంచిది. వీటిలో 90 శాతం వరకు అసంతృప్త కొవ్వులు ఉండటంవల్ల గుండె ఆరోగ్యానికి కూడా మంచిది.
క్యాన్సర్ నివారణకు
చిల్గోజాలను తరచూ తినడంవల్ల జంక్ ఫుడ్ తినాలనే కోరిక కూడా తగ్గుతుందని పోషకాహార నిపుణులు చెప్తున్నారు. వీటిలో ఒమేగా 6, సెలీనియం ఉంటాయి. ఇవి శరీరంలో క్యాన్సర్ కణాలను పెరగకుండా నిరోధిస్తాయి కాబట్టి వీటిని తినేవారిలో క్యాన్సర్ వచ్చే రిస్క్ తగ్గుతుంది.
సంతోనోత్పత్తి సామర్థ్యానికి
సెలీనియం, జింక్ కంటెంట్ ఎక్కువగా ఉండటంవల్ల చిల్గోజా గింజలు పురుషుల్లో సంతోనోత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతాయని నిపుణులు చెప్తున్నారు. వీటివల్ల స్పెర్మ్‌కౌంట్ పెరగడంతోపాటు వీర్య కణాల నాణ్యత కూడా పెరుగుతుంది.
గాయాలు, డిప్రెషన్ సమయంలో..
చిల్గోజాలో జింక్ ఉండటంవల్ల శరీరంపై ఏర్పడిన గాయాలు, పుండ్లు వేగంగా నమయం అవుతాయి. మెగ్నీషియం కంటెంట్ కారణంగా చిరాకు, డిప్రెషన్, మూడ్ స్వింగ్స్ వంటి ప్రాబ్లమ్స్ ఉన్నవారు వీటిని తింటే ఆ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంది. రాత్రిపూట తినడంవల్ల కండరాలకు మంచిదని చెప్తారు. మోనోపాజ్ స్టేజ్ తర్వాత మహిళల్లో ఎముకల సాంద్రత తగ్గుతుంది. ఇలాంటప్పుడు చిల్గోజా గింజలు తింటే మంచి ఫలితం ఉంటుంది. ఎముకలు బలంగా తయారవుతాయి. స్గైసెమిక్ ఇండెక్స్ ఉండటంవల్ల పైన్ గింజలు డయాబెటిస్ రిస్క్ కూడా తగ్గుతుంది.
* గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహనకోసం మాత్రమే అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు ‘దిశ’ బాధ్యత వహించదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.