రింగ్‌లో 'పిల్లో‌ఫైట్'.. రూ. 3.73 లక్షలు గెలుచుకున్న ఫైటర్స్!

by Disha News Desk |
రింగ్‌లో పిల్లో‌ఫైట్.. రూ. 3.73 లక్షలు గెలుచుకున్న ఫైటర్స్!
X

దిశ, ఫీచర్స్ : సాధారణంగా ఫ్రెండ్స్, సిబ్లింగ్స్.. తమకు కోపమొస్తే ఒకరినొకరు 'దిండు'తో కొట్టుకుంటారు. చాలామంది సెలబ్రిటీలు సైతం చిన్నతనంలో సరదాగా ఆడిన 'పిల్లో ఫైటింగ్' గురించి చెప్పుకుంటుంటారు. అలాంటి 'పిల్లో ఫైటింగ్' ఇప్పుడు స్పోర్ట్స్ రింగ్‌లో ఆడేటువంటి పోరాట క్రీడగా మారింది. ఇందుకు సంబంధించిన ఈవెంట్‌ను ఇటీవలే నిర్వహించగా.. విజేతగా ఎవరు నిలిచారు? విన్నర్స్ ఎంత ప్రైజ్‌మనీ గెలుచుకున్నారో తెలుసుకుందాం.

మొట్టమొదటి ప్రొఫెషనల్ 'పిల్లో ఫైటింగ్' చాంపియన్‌షిప్ (PFC) గత నెల ఫ్లోరిడాలో జరిగింది. 24 మంది పోటీదారులు పాల్గొన్న ఈవెంట్‌లో 16 మంది పురుషులు, ఎనిమిది మంది మహిళలు ఉన్నారు. పోటీదారులు ప్రత్యర్థులపై దాడి చేసేందుకు ప్రత్యేకంగా రూపొందించిన దిండ్లను ఉపయోగించారు. ఇక కంటెస్టెంట్స్ తమ ప్రత్యర్థులపై పంచ్‌లు, కిక్‌లకు బదులు దిండ్లతో పోరాడగా.. నిర్వాహకులు ఈ పోటీని 'పే-పర్-వ్యూ' టోర్నమెంట్‌గా పరిచయం చేశారు. ఈ చాంపియన్‌షిప్ ఫైనల్స్‌లో బ్రెజిల్‌ మహిళ ఇస్టెలా న్యూన్స్.. కెండాల్ వోల్కర్‌ను ఓడించి విజేతగా నిలిచింది. ఇక పురుషుల్లో అమెరికా వాసి హౌలీ టిల్మాన్, స్వదేశానికి చెందిన మార్కస్ బ్రిమేజ్‌పై గెలుపొందాడు. విజేతలిద్దరికీ 5,000 US డాలర్ల నగదు(దాదాపు ₹ 3.73 లక్షలు) బహుమతితో పాటు బెల్ట్ లభించాయి.


ప్రజలు థ్రిల్‌‌గా ఫీలవుతున్నారు..

అంతర్జాతీయ కుటుంబ ప్రేక్షకులను ఆకర్షించే నిజమైన పోరాట క్రీడను అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఈ పిల్లో ఫైట్ ప్రారంభించాం. ఇది తక్కువ టైమ్‌లోనే టీవీలో పిల్లలు చూడగలిగే స్వచ్ఛమైన వినోదంగా మారింది. చాలా సరదాగా ఉండే ఈ గేమ్‌కు సంబంధించి ప్రతీ ఫైట్‌లో రెండు నిమిషాల వ్యవధి గల మూడు రౌండ్స్ ఉంటాయి. మా పోరాటాలకు, మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్(MMA) పోరాటాలకు మధ్య ఉన్న ఏకైక తేడా.. ఎవరూ గాయపడకపోవడమే. రాబోయే సంవత్సరాల్లో పిల్లో ఫైట్ చాంపియన్‌షిప్ మరింత ప్రజాదరణ పొందుతుంది. ప్రొఫెషనల్ పిల్లో ఫైటింగ్ పోటీల పట్ల ప్రజలు ఇప్పటికే థ్రిల్‌గా ఫీలవుతున్నారు. సమీప భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని ఈవెంట్స్ నిర్వహించేందుకు మాకు ప్రోత్సాహం లభించింది' అని పిల్లో ఫైటింగ్ ఛాంపియన్‌షిప్ సీఈఓ స్టీవ్ విలియమ్స్ తెలిపారు.

https://www.instagram.com/p/CZcwiygpT_P/?utm_source=ig_embed&ig_rid=1df47bcb-36b6-47a4-b2a7-865db35a9d11

Advertisement

Next Story

Most Viewed