ఐదు లీటర్ల పెట్రోల్‌ ధర రూ.3.60 పైసలు మాత్రమే.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బిల్లు

by Sujitha Rachapalli |   ( Updated:2024-07-22 15:28:35.0  )
ఐదు లీటర్ల పెట్రోల్‌ ధర రూ.3.60 పైసలు మాత్రమే.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బిల్లు
X

దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం డీజిల్,పెట్రోల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పక్క దేశాల్లో ముప్పై, నలభై రూపాయలకే లీటర్ దొరుకుతుండగా.. మన దేశంలో మాత్రం ఎప్పుడో సెంచరీ దాటేసింది. దీని కారణంగా ప్రభుత్వంపై కూడా విమర్శలు భారీగానే వస్తున్నాయి. ఈ క్రమంలో 1961కి సంబంధించిన బిల్లు నెట్టింట వైరల్ అవుతుంది.


భారత్ పెట్రోల్ సప్లయ్ కంపెనీ ఇచ్చిన బిల్ రిసిప్ట్‌ ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. ఐదు లీటర్ల పెట్రోల్ కేవలం మూడు రూపాయల అరవై పైసలకే ఇచ్చినట్లు ఇందులో ఉంది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. అలాంటి రోజులు మళ్లీ వస్తే బాగుండేదని కోరుకుంటున్నారు. ఇంకొందరేమో అప్పుడు రూపాయికి వాల్యూ ఉండేది.. ఇప్పుడు లేదు.. అదే తేడా అంటున్నారు. ఇక అప్పటి జీతాలు కూడా అలాగే ఉండేవని చెప్తున్నారు మరికొందరు.

Read more...

Cloths: బట్టలపై XL , XXL అంటూ ఉంటాయి కదా.. మరి X అంటే ఏమిటో మీకు తెలుసా?



Advertisement

Next Story

Most Viewed