జుట్టుకి రంగేసే వాళ్లు.. వీటి గురించి తప్పక తెలుసుకోవాలి!

by Prasanna |
జుట్టుకి రంగేసే వాళ్లు.. వీటి గురించి తప్పక తెలుసుకోవాలి!
X

దిశ, ఫీచర్స్ : మారుతున్న ఆహారపు అలవాట్ల కారణంగా నేడు చాలా మంది చిన్నవయసులోనే తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్నారు. దీని కోసం చాలా మంది హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంటారు. ఇంక చేసేదేమి లేక జుట్టుకు రంగు వేయడమే వేరే మార్గమని రంగులు వేస్తుంటారు. కానీ, కొంతమంది ఫ్యాషన్ కోసం కూడా అదే పనిగా కలర్ వేస్తున్నారు.

కొన్ని అధ్యయనాల ప్రకారం, తరచుగా హెయిర్ కలర్ వేయడం వలన కొన్ని రకాల క్యాన్సర్లు వస్తాయని నిపుణులు అంటున్నారు. అయితే, మీ జుట్టుకు రంగు వేసిన తర్వాత కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఈ చిట్కాలు మీ రంగు ఎక్కువసేపు ఉండేందుకు, మీ జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయి.

రెగ్యులర్ గా జుట్టుకి నూనెను రాస్తూ ఉండాలి. ముఖ్యంగా షాంపూ చేయడానికి ముందు అలాగే మీ జుట్టును వేడి నూనెతో మసాజ్ చేయండి, ఇది జుట్టుకు పోషణనిస్తుంది. వారానికి మూడు రోజులు మాత్రమే షాంపూతో హెడ్ బాత్ చేయాలి. సల్ఫేట్ లేని, కలర్ సేఫ్ షాంపూని ఉపయోగించండి. అలాగే క్లోరిన్ తక్కువగా ఉన్న నీటితో మాత్రమే స్నానం చేయండి. మీ జుట్టు కడిగిన తర్వాత కండీషనర్ రాయడం మర్చిపోవద్దు. ఇది జుట్టును మృదువుగా ఉండేలా చేస్తుంది. వీటిని ఫాలో అవ్వడం వలన మీ జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.

Advertisement

Next Story

Most Viewed