- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పీసీఓడీ.. హార్మోనల్ ఇంబ్యాలెన్స్‌తో స్త్రీలలో తలెత్తుతున్న సమస్య
దిశ, ఫీచర్స్: పీసీఓడీ (Polycystic Ovarian Disease) అనేది అండాశయానికి సంబంధించిన ఆరోగ్య సమస్య. దీనిని పీసీఓఎస్ (Polycystic Ovarian Syndrome) అని కూడా పిలుస్తారు. 12 నుంచి 45 సంవత్సరాల వయసు కలిగిన యువతులు, మహిళల్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కారణంగా ఏర్పడుతుంది. ఈ కారణంగా ఇర్రెగ్యులర్ పీరియడ్స్, గర్భధారణ సమస్యలు ఉత్పన్నమవుతాయి. సాధారణంగా అండాశయాలు ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్‌తో పాటు కొంత మొత్తంలో టెస్టోస్టెరాన్‌ను ఉత్పత్తి చేస్తాయి. పీసీఓడీ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నవారిలో ఆండ్రోజెన్ అనే హార్మోన్ కూడా అధికంగా ప్రొడ్యూస్ అవుతుంది. దీనిని ‘హైపర్ ఆండ్రోజనిజం’ అని కూడా అంటారు. అండాశయంలో ఇబ్బందులు, నెలసరి రాకపోవడానికి ఈ పరిస్థితే ప్రధాన కారణం.
లక్షణాలు
పీరియడ్స్ రెగ్యులర్‌గా ఉండకపోవడం, తరచూ మొటిమలు, ఊబకాయం, జుట్టు ఊడిపోవడం, అండం సమయానికి విడుదల కాకపోవడం, విడుదలైనప్పటికీ బలహీనంగా ఉండటం, ఆండ్రోజెనిక్ హార్మోన్లు అధికంగా ఉత్పత్తి కావడం, అండాశయం పెద్దగా ఉండటం, అండాల చుట్టూ ఫోలికల్స్ ఉండటం (పాలిసిస్టిక్ అండాశయాలు) వంటి లక్షణాలు గమనించవచ్చు. 0.3 అంగుళాల (8 మిల్లీమీటర్లు) వ్యాసార్థం కలిగిన అండాశయాల చుట్టూ అనేక ఫోలికల్స్ ఏర్పడతాయి. ఇవి అండం విడుదల కావడానికి ఆటంకం కలిగిస్తుంటాయి. అలాగే ఛాతీ, వెన్ను లేదా పిరుదులపై కూడా అధికంగా జుట్టు పెరగడం, తల వెంట్రుకలు సన్నబడటం, చర్మం జిడ్డుగా ఉండటం పీసీఓడీ లక్షణాలుగా చెప్పొచ్చు. మెడ, చేతులు, రొమ్ములు, తొడలపై చర్మం గట్టిగా అవడం, అధిక బరువు, ఆందోళన, డిప్రెషన్ వంటివి కనిపిస్తాయి. ఇక పీసీఓడీ ఇన్సులిన్, టెస్టోస్టిరాన్ వంటి అధికస్థాయి హార్మోన్లతో పాటు ఫ్యామిలీ జెనెటిక్ హిస్టరీ కారణంగానూ ఏర్పడుతుంది. అంటే కుటుంబంలో ఎవరికైనా పీసీఓడీ ఉన్నట్లయితే సదరు వ్యక్తి సంతానానికి ఉండే అవకాశం ఉంటుంది. లక్షణాలు తగ్గించే ట్రీట్‌మెంట్ విషయంలో నిర్లక్ష్యం చేస్తే క్రమంగా టైపు 2 డయాబెటిస్, హైకొలెస్ట్రాల్ డిసీజ్‌లకు దారితీయవచ్చు.
ట్రీట్‌మెంట్
పీసీఓడీకి పర్‌ఫెక్ట్ ట్రీట్మెంట్ ఏమీ లేదు. కానీ దాని ప్రభావాన్ని, లక్షణాలను తగ్గించడం ద్వారా సమస్యకు చెక్ పెట్టవచ్చు. అన్నింటికంటే ముఖ్యంగా కొన్ని నివారణా చర్యలు కంపల్సరీ. హెల్తీ ఫుడ్ తీసుకోవడంతో పాటు శారీరక శ్రమ కలిగిన జీవనశైలిని అలవర్చుకోవాలి. ఊబకాయం లేదా అధిక బరువు శరీరంలో ఇన్సులిన్ నిరోధకతను పెంచుతుంది. పీసీఓడీ లక్షణాలను తీవ్రతరం చేస్తుంది. కాబట్టి బరువు తగ్గడానికి వైద్యులను సంప్రదించి తగిన సలహాలు పాటించాలి.
మెడిసిన్స్, నివారణ
ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ప్రాబ్లమ్ క్లియర్ కావడానికి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్‌ను తగ్గించేందుకు, అండాల విడుదల సమాయాన్ని సరిదిద్దడానికి మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయి. డాక్టర్లు సజెస్ట్ చేసే ఓరల్ మెడిసిన్ ఈ సమస్యను పరిష్కరిస్తుంది. అలాగే పీసీఓడీ కారణంగా గర్భం ధరించకపోవడం జరుగుతుంటే వైద్యులు క్లోమిఫెన్ వంటి ఔషధాలను సూచిస్తారు. ఇవి అండాల విడుదలకు, గర్భధారణకు తోడ్పడుతాయి. మందులు వాడాక కూడా గర్భం రాకపోతే లాప్రోస్కోపిక్ (laparoscopic ovarian drilling) చికిత్స అవసరం కావచ్చు. అండాశయాల్లో అసాధారణ లేదా అవసరంలేని కణాలను విచ్ఛిన్నం చేసి, గర్భధారణకు అవసరమైన అండాల విడుదలకు, ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవీఎఫ్)కు ల్యాప్రోస్కోపిక్ ట్రీట్మెంట్ దోహదం చేస్తుంది.
ఇవి కూడా చదవండి: గర్భాశయ క్యాన్సర్.. మానసికంగా బాధపడుతున్న స్త్రీలలో అధికం