- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఎవరికి వస్తుంది..? లక్షణాలను ఎలా గుర్తించాలి..?
దిశ, వెబ్‌డెస్క్ : క్యాన్సర్. ఈ పదం వింటే చాలు గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. కాళ్లు చేతులు వణికిపోయి మనిషి కుప్పకూలినంత పని అవుతుంది. ప్రస్తుతం మారిన జీవన విధానంలో చాలా మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. అయితే క్యాన్సర్‌లో కూడా ఎన్నో రకాల ఉన్నాయి. రొమ్ము, ఊపిరితిత్తులు, చర్మం, గొంతు ఇలా ఎన్నో రకాల క్యాన్సర్లు వస్తుంటాయి. అందులో ఒక క్యాన్సర్‌నే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అంటారు. ఈ క్యాన్సర్ వ్యాధిని గుర్తించిన నాటి నుంచి చికిత్స చివరి అంకం వరకు ఎన్నో బాధలను ఎదుర్కోవలసి వస్తుంది. అయితే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌ని మొదటి దశలోనే కనిపెడితే దాని నుంచి తప్పించుకునే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. సరైన వైద్యం తీసుకోకపోతే ప్రమాదంగా మారుతుందని కూడా హెచ్చరిస్తున్నారు. మరి ఈ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఎలా వస్తుంది, ఎలా కనుక్కోవచ్చు, వైద్యం ఎలా ఉంటుంది వైద్య నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.
ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అంటే..
ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కడుపులో వచ్చే క్యాన్సర్‌లలో ఒకటి. ఈ వ్యాధి లక్షణాలు గ్యాస్, అసిడిటీగా ఉంటాయి. ఈ క్యాన్సర్‌ని గుర్తించడం కాస్త కష్టం అనే చెప్పుకోవాలి. మొదటి దశలోనే ఈ వ్యాధిని గుర్తించి వైద్యం అందించకపోతే చాలా కష్టమవుతుంది.
క్యాన్సర్
ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఉన్నవారు తిన్నా తినకపోయినా ఎప్పుడు కడుపు నిండినట్టుగానే ఉంటుంది. ఏదైనా ఆహారం తిన్న తర్వాత కడుపులో విపరీతంగా నొప్పిగా ఉంటుంది. కడుపు ఉబ్బరంగా ఉంటుంది. కొన్ని సార్లు గ్యాస్‌కి సంబంధించిన మందులు వాడినా ఎలాంటి ఉపయోగం ఉండదు. తిన్న తిండి కూడా జీర్ణం కాకుండా వాంతులు అవుతూ ఉంటాయి. అలాగే పొట్ట కూడా చాలా వరకు తగ్గిపోతుంది. మలం నల్లగా రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
పెయిన్ కిల్లర్స్..
బాడీ పెయిన్స్, కండరాల నొప్పులు తగ్గించుకోవడానికి వేసుకునే పెయిన్ కిల్లర్స్ వల్ల చాలా నష్టాలు ఉన్నాయి. ఈ పెయిన్ కిల్లర్ మందులు వాడటం వలన హెచ్ పై లోరీ అనే బ్యాక్టీరియా కడుపులోకి చేరడంతో గ్యాస్ సమస్య పెరిగి ఛాతీలో మంటలు వస్తుంటాయి.
గ్యాస్ ట్రబుల్..
గ్యాస్ ట్రబుల్, ఛాతిలో మంటలు అనే సమస్యను చాలా మంది ఎదుర్కొంటూ ఉంటారు. సమయానికి తినకపోవడం, పొగ తాగడం, సిగరెట్, ఆల్కహాల్ తీసుకోవడంతో గ్యాస్, అసిడిటీ సమస్యలు తలెత్తుతాయి. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌తో ఇబ్బందిపడేవారికి కడుపులో యాసిడ్ ఉత్పత్తి పెరిగి అల్సర్లు పెరుగుతాయి.
ఎలా టెస్ట్ చేస్తారు..
ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌ను గుర్తించడానికి ఎండోస్కోపీ చేయవలసి ఉంటుంది. పైన తెలిపిన లక్షణాలు కనిపించినప్పుడు వైద్యులు ఎండోస్కోపీ చేస్తుంటారు.