'ఒక్కడున్నాడు' మూవీ సీన్ రిపీట్!.. బాంబే బ్లడ్ గ్రూప్.. రక్తదానంకి ఏకంగా 400 కి.మీ ప్రయాణం

by Kavitha |
ఒక్కడున్నాడు మూవీ సీన్ రిపీట్!.. బాంబే బ్లడ్ గ్రూప్.. రక్తదానంకి ఏకంగా 400 కి.మీ ప్రయాణం
X

దిశ, ఫీచర్స్: రక్తాన్ని దానం చేయడమంటే ప్రాణాన్ని దానం చేసినట్లు అన్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఓ వ్యక్తి ఏకంగా 400 కిలోమీటర్లు ప్రయాణించి చావుబతుకుల్లో ఉన్న ఓ మహిళ ప్రాణాలు నిలబెట్టాడు. ఇంతకీ ఆయన దానం చేసిన బ్లడ్ గ్రూప్ ఏంటంటే అత్యంత అరుదైన ‘బాంబే’ బ్లడ్

మహారాష్ట్రలోని షిర్డీకి రవీంద్ర అష్తేకర్‌ (36) పూల వ్యాపారి. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన ఓ మహిళ (30) హాస్పిటల్‌లో ప్రాణాలతో పోరాడుతున్నదని, ఆమెకు అర్జెంటుగా బాంబే బ్లడ్‌గ్రూప్‌ కావాలన్న వాట్సాప్‌ మెసేజ్‌ చూసిన రవీంద్ర వెంటనే స్నేహితుడి కారులో 440 కిలోమీటర్లు ప్రయాణించి ఈ నెల 25న రక్తదానం చేసి ఆ మహిళ ప్రాణాలను కాపాడగలిగాడు. అత్యంత అరుదైన బ్లడ్‌గ్రూప్‌ కలిగిన రవీంద్ర రాష్ర్టాలతో సంబంధం లేకుండా ఎక్కడ ఎవరికి అవసరం పడిన వెంటనే వెళ్లి రక్తదానం చేస్తారు. ఇలా మహారాష్ట్రతోపాటు గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌లలో గత పదేండ్లలో 8 సార్లు రక్తదానం చేశారు.

కాగా బాంబే బ్లడ్‌గ్రూప్‌ను 1952లో కనుగొన్నారు. ఇందులో ‘హెచ్‌’ యాంటీజెన్‌కు బదులుగా యాంటీ-హెచ్‌ యాంటీబాడీస్‌ ఉంటాయి. వీరికి ఆ గ్రూప్ కలిగిన వారే రక్తం ఇవ్వాల్సి ఉంటుంది.

Advertisement

Next Story