- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆత్మహత్యలను ప్రేరేపిస్తున్న ఓసీడీ.. సర్వేలో షాకింగ్ విషయాలు వెళ్లడి!
దిశ, ఫీచర్స్ : చాలా మంది వ్యక్తులు తమకు తెలియకుండానే, వారు ఎదుర్కొంటున్న సమస్యలో ఓసీడీ ఒకటి. అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్. ఇది ఒక వ్యక్తి చేసిన పని పదే పదే చేయాలనే అనుభూతిని కలిగిస్తుంది.
ఈ వ్యాధి బారిన పడిన వారు చేసిన పనినే మళ్లీ మళ్లీ చేస్తుంటారు. చేతులను కడగడం, డౌట్‌గా ఫీలై మళ్లీ ఏదైనా హ్యండ్ వాష్‌తో శుభ్రం చేసుకోవడం, శానిటైజర్ రాయడం లాంటివి చేస్తుంటారు. ఇలాంటి చిన్న చిన్న పనులను వారు రోజు చేస్తూ.. మెంటల్‌గా ఇబ్బంది పడుతుంటారు. అలాగే ముఖ్యమైన పనులను కంప్లీట్ చేసుకోకుండా, ఎక్కువ ఆలోచిస్తూ పనులను ఆలస్యం చేస్తుంటారు.
అయితే దీనిపై సర్వే చేసిన ఓ సంస్థం షాకింగ్ విషయాలను తెలిపింది. ఓసీడీ ఉన్న వ్యక్తులు మాములు వ్యక్తుల కంటే ముందుగా చనిపోవడం లేదా, ఆత్మహత్యలు చేసుకునే అవకాశం 82 శాతం ఎక్కువ ఉందని వెళ్లడించింది.ఈ ఓసీడీ జనాభాలో రెండు శాతం మందిని తీవ్రంగా ప్రభావితం చేస్తుదంట. ఈ వ్యాధి ఉన్న వ్యక్తులు ఎక్కువగా బాధాకరమైన ఆలోచనలు కలిగి ఉంటారంట. ఏదైనా కలిషితం అవుతదనే భయంతో చేసిన పనినే మళ్లీ చేయడం అధికంగా ఉంటుంది. ఇది వారి జీవితాన్ని గణనీయంగా దెబ్బతీస్తుందని, దీని వలన సంబంధాలు, నలుగురితో కలిసి ఉడటం లాంటివి చేయకపోవడం వలన మనోవేధనకు గురి అయ్యే అవకాశం ఎక్కువ ఉన్నది అంటున్నారు నిపుణులు.
స్వీడన్‌లోని కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్ వారు ఓసీడీ లేని 613,780మంది వ్యక్తులతో ఓసీడీ ఉన్న 61,378 మందిని పరిశీలించగా అందులో 69 నుంచి 78 ఏళ్ల వయసున్నవారు ఓసీడీ లేనివారికంటే ముందుగా చనిపోయినట్లు నిర్దారించడారంట. ఓసీడీ ఉన్నవారిలో 92 శాతం మంది సహజకారణాలతో మరణిస్తే మరికొంత మంది యాక్సిడెట్స్ కారణంగా చనిపోయారంట. అయితే ఈ ఓసీడీ ఆత్మహత్యలను ఎక్కువగా ప్రేరేపిస్తుందంట. దీని కారణం మన మెదడులోని గ్రే మేటర్. ఇది మన మెదడులో ప్రేరణలను కంట్రోల్ చేయడానికి పనిచేస్తుంది. ఓసీడీ వ్యక్తుల్లో గ్రే మ్యాటర్ తగ్గడం వలన ప్రేరణ నియంత్రించుకోలేరు. OCD లేని వారితో పోలిస్తే, OCD ఉన్నవారు ఆత్మహత్య ద్వారా చనిపోయే ప్రమాదం దాదాపు ఐదు రెట్లు ఎక్కువ. ఇక ఓసిడి ద్వారా ఊపిరితిత్తుల వ్యాధి వచ్చేందుకు 73% రిస్కు ఉంటుందని, అలాగే మెంటల్ కండిషన్ డిజార్డర్ రిస్క్ 58% ఉంటుందని, నాడీ వ్యవస్థ మీద రిస్క ప్రభావం 23 శాతం వరకు ఉంటుందని చెబుతున్నారు. ఓసీడీ ద్వారా డిప్రెషన్, ఫ్రెస్ పెరగడం ద్వారా ఆత్మహత్య ఆలోచనలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.