Obesity in women: మహిళల్లో ఒబేసిటీ.. ఈ 4 కారణాలవల్లే అసలు సమస్య!

by Javid Pasha |   ( Updated:2024-09-05 12:26:31.0  )
Obesity in women: మహిళల్లో ఒబేసిటీ.. ఈ 4 కారణాలవల్లే అసలు సమస్య!
X

దిశ, ఫీచర్స్: ఇటీవల చాలామందిని వేధిస్తున్న సమస్యల్లో ఒబేసిటీ (Obesity) ఒకటి. బిజీ లైఫ్ షెడ్యూల్, మానసిక ఒత్తిళ్లు, జీవన శైలిలో ప్రతికూల మార్పులు వంటివి ఇందుకు కారణం అవుతున్నాయి. కాగా పురుషులతో పోలిస్తే స్త్రీలే ఎక్కువగా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నట్లు నిపుణులు చెప్తున్నారు. ఇలా వేగంగా బరువు పెరగడానికి ఐదు కారణాలు ఉన్నాయని చెప్తున్నారు. అవేమిటో చూద్దాం.

* ఆహారపు అలవాట్లలో మార్పులు : మహిళలు పురుషులకంటే కూడా ఫాస్ట్‌గా ఒబేసిటీ బారిన పడటానికి ఆహారపు అలవాట్లు కూడా ఓ రీజన్ అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా పోషకాలు లేని ఆహారం తీసుకోవడం వల్ల ఈటింగ్ డిజార్ల బారిన పడి జంక్ ఫుడ్స్ తినడం, కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి ఆలోచిస్తూ తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం, వ్యాయామాలకు దూరంగా ఉండటం,నిద్రలేమి వంటివి మహిళల్లో అధిక బరువు సమస్యలకు కారణం అవుతున్నాయి. దీంతోపాటు రాత్రిళ్లు లేటుగా తినడం, వేయించిన ఆహారాలు (Fried foods) ఎక్కువగా తీసుకోవడం కూడా బరువు పెరగడానికి దారితీస్తున్నాయి.

* మానసిక ఒత్తిడి : మహిళలు గృహిణులుగా ఉన్నా, ఉద్యోగం చేస్తున్నా ఇంటి బాధ్యతలు నెరవేర్చడం, ఇంటిలో మొత్తం పనిచేసుకోవడం వారే చేస్తుంటారు. దీంతో తీవ్ర అలసటకు గురవడం, మానసిక ఒత్తిడికి (mental stress) లోనవడం సహజంగానే జరిగిపోతుంటాయి. ఇది కూడా శరీర బరువు పెరగడానికి కారణం అవుతోంది. ఎందుకంటే స్ట్రెస్ వల్ల శరీరంలో ‘కార్టిసాల్’ హార్మోన్ పెరుగుతుంది. ఇది కూడా శరీర బరువు పెరగడానికి పరోక్షంగా కారణం అవుతుందని నిపుణులు చెప్తున్నారు.

* ఫిజికల్ యాక్టివిటీస్ తగ్గడం : ఇంటిలో వివిధ పనులు చేస్తున్నప్పటికీ శారీక కదలికలు తగినంతగా లేకపోవడం కూడా అధిక బరువు సమస్యకు దారితీస్తాయి. నిశ్చల జీవన శైలివల్ల ఒబేసిటీతో పాటు గుండె జబ్బుల రిస్క్ (Risk of heart disease) కూడా పెరుగుతుంది. అందుకే యోగా, మెడిటేషన్, వాకింగ్ వంటివి చేయాలని నిపుణులు చెప్తున్నారు.

* నిద్రలేకపోవడం : కుటుంబంలో ఎవరికి అనారోగ్యం చేసినా, ఆర్థిక ఇబ్బందులు ఎదరైనా మహిళలు ఎక్కువగా ఆలోచిస్తుంటారని, ఈ క్రమంలో వారిలో నిద్రలేమి కూడా వస్తుందని నిపుణులు చెప్తున్నారు. ఇది కూడా క్రమంగా శరీరంలో హార్మోన్ల అసమతుల్యతకు దారితీస్తుంది. ఫలితంగా మెటబాలిజం (Metabolism) పనితీరు మందగిస్తుంది. దీంతో ఒబేసిటీ బారిన పడతారని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. కాబట్టి పైన పేర్కొన్న సమస్యలు మీలో కనిపిస్తే గనుక జాగ్రత్త పడాలి. వైద్య నిపుణులను సంప్రదించి వారి సలహాలు పాటించడం ద్వారా, హెల్తీ లైఫ్ స్టైల్‌ను (Healthy Life) అలవర్చుకోవడం ద్వారా ఒబేసిటీ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చునని నిపుణులు చెప్తున్నారు.

*గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. నిర్ధారణలు, పర్యవసనాలకు ‘దిశ’ బాధ్యత వహించదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed