- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టొమాటోలు ఎక్కువగా ఎవరు తినకూడదు.. కారణం ఏంటో తెలుసా..
దిశ, ఫీచర్స్ : టోమాటోలు లేకుండా ఏ వంటకం పూర్తి కాదు. టొమాటోలు మీ ఆహారానికి రుచి, రంగును అందిస్తాయి. టోమాటోల నుండి గ్రేవీలు, చట్నీలు, సలాడ్‌లు, సాస్‌లు, సూప్‌లు వంటి అనేక వంటకాలను చేస్తారు. టొమాటోలో ఫాస్ఫరస్, పొటాషియం, కాల్షియం, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం, యాంటీ ఇన్ఫ్లమేటరీ వంటి పోషకాలు ఉన్నాయి. అయితే కొంతమంది తమ ఆహారంలో టోమాటోలను ఎక్కువగా ఉపయోగిస్తారు. కానీ టోమాటోలు ఎక్కువగా తినడం ప్రమాదకరం.
మూత్రపిండాల్లో రాళ్లు..
టొమాటోలో కాల్షియం ఆక్సలేట్ పుష్కలంగా ఉంటుంది. ఆహారంలో టోమాటోలు ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీ స్టోన్ సమస్యలు వస్తాయి. ఇప్పటికే కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నవారు టోమాటోలకు దూరంగా ఉండాలని ఆయుర్వేదం చెబుతోంది. మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదం కూడా ఉందని చెబుతున్నారు నిపుణులు.
ఆమ్లత్వం..
టొమాటోలోని ఆమ్ల స్వభావం కారణంగా, దానిని ఎక్కువగా తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ యాసిడ్ ఉత్పత్తి అవుతుంది. ఎక్కువగా టోమాటోలు తింటే గుండెల్లో మంట, అసిడిటీ, యాసిడ్ రిఫ్లక్స్, జీర్ణ సమస్యలు ఏర్పడవచ్చు.
కీళ్ల నొప్పుల సమస్య..
టొమాటోలో సోలనిన్ అనే ఆల్కలాయిడ్ ఉంటుంది. ఇది మీ కీళ్లలో వాపు, నొప్పిని కలిగిస్తుంది. టొమాటో మన కణాలలో కాల్షియం ఉత్పత్తి చేయడానికి పనిచేస్తుంది. ఇది కీళ్ల వాపునకు కారణమవుతుంది. ఈ సమస్య ఏర్పడితే కూర్చోవడం, నడవడం కష్టతరం చేస్తుంది.
అలెర్జీ సమస్య..
టొమాటోలో హిస్టామిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది శరీరంలో అలెర్జీ సమస్యను కలిగిస్తుంది. టొమాటోలు ఎక్కువగా తీసుకోవడం వల్ల గొంతులో చికాకు, తుమ్ములు, తామర, నాలుక, ముఖం, నోటి వాపు వంటివి వస్తాయి. మీకు ఇప్పటికే ఈ సమస్యలన్నీ ఉంటే, మీ ఆహారంలో టొమాటోలు ఉపయోగించకుండా ఉండండి.
ప్రేగుల సమస్య..
టొమాటోలను ఎక్కువగా తీసుకోవడం వల్ల మీ ప్రేగులలో సమస్యలు తలెత్తుతాయి. ఎక్కువ టోమాటోలు తినడం వల్ల ప్రేగు సిండ్రోమ్ ఏర్పడుతుంది. దీనివల్ల పేగుల్లో ఇబ్బంది ఏర్పడుతుంది. ఇప్పటికే అజీర్తితో బాధపడుతున్న వ్యక్తులు టొమాటోలు తినగానే కడుపు ఉబ్బిపోతుంది. కాబట్టి ఈ వ్యక్తులు కూడా టొమాటోలను తినకుండా ఉండాలి.