- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లవర్స్ బ్రేకప్ కోసం.. బడ్జెట్‌లో రూ. 33 కోట్లు కేటాయించిన ప్రభుత్వం
దిశ, ఫీచర్స్: ప్రేమ, పెళ్లి, బ్రేకప్ వంటివి యువతలో భావోద్వేగాలను ప్రభావితం చేసే అంశాలుగా ఉంటాయి. లవ్ ఫెయిల్యూర్‌తో తీవ్రమైన బాధను అనుభవిస్తుంటారు. ఈ దశ నుంచి కోలుకుని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తే సమస్యే లేదు. కానీ న్యూజిలాండ్‌లో అలాంటి పరిస్థితి చాలా అరుదు. ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడి యువత బ్రేకప్‌ను తట్టుకోలేకపోతోంది. విడిపోయిన జంటల్లో ఎక్కువమంది డిప్రెషన్‌కు లోనవుతూ తమ జీవితాలను ముగించేస్తున్నారు. దీంతో న్యూజిలాండ్ ప్రపంచంలో హైయెస్ట్ యూత్ సూసైడ్ రేటు కలిగిన దేశాల్లో ఒకటిగా ఉంది. కాగా ఈ పరిస్థితితో అక్కడి ప్రభుత్వంలోనూ కదలిక వచ్చింది. బ్రేకప్ యువతపై చెడు ప్రభావం చూపకుండా ఉండేందుకు బడ్జెట్‌లో రూ.33 కోట్లను కేటాయించింది. ఆ నిధుల ద్వారా ‘లవ్ బెటర్’ క్యాంపెయిన్ నిర్వహిస్తోంది.
న్యూజిలాండ్‌కు చెందిన సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ సర్వే ప్రకారం.. 68 శాతం మంది బ్రేకప్ వల్ల కలిగే సాధారణ బాధకు మించిన తీవ్రమైన భావోద్వేగాలను ఎదుర్కొంటున్నారు. దీంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. యువత జీవితంలో బ్రేకప్ విషాదాంతంగా మారకూడదనే ఉద్దేశంతో దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. ఈ క్రమంలో బంధం ముగిసినప్పుడు ఏమి చేయాలనే దాని గురించి మద్దతిస్తుంది ఈ లవ్ బెటర్ క్యాంపెయిన్. బాధాకరమైన భావాలను ప్రాసెస్ చేయడానికి ఆరోగ్యకరమైన మార్గాలను సూచిస్తుంది. ‘ఓన్ ద ఫీల్స్’ అని ప్రజలను కోరే ఈ ప్రచారం.. ఇలాంటి అనుభవాలను ఎక్స్‌పీరియన్స్ చేసిన యువకులు తోటివారికి సహాయం చేయడానికి తమ రియల్ లైఫ్ స్టోరీస్‌ను పంచుకుంటారు. తద్వారా భవిష్యత్తులో ఎలాంటి పార్ట్‌నర్‌ను ఎంచుకోవాలి? సంబంధాలను ఎలా మెరుగుపరచుకోవాలి? అనే విషయాలను నేర్చుకుంటారు. ఈ క్రమంలో యూత్ సూసైడ్ రేట్ కూడా తగ్గిపోతుందనేది ప్రభుత్వ ఉద్దేశం.
Also Read...
- Tags
- New Zealand