క్రియేటివిటీని దెబ్బతీస్తున్న గాలి కాలుష్యం.. పరిష్కారమేంటి?

by Javid Pasha |
క్రియేటివిటీని దెబ్బతీస్తున్న గాలి కాలుష్యం.. పరిష్కారమేంటి?
X

దిశ, ఫీచర్స్ : పర్యావరణ, వాయు కాలుష్యాలు మొత్తం మానవ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. అయితే కొన్ని ప్రదేశాలకే పరిమితమై ఉండే గాలిలోని అస్థిర కర్బనాలు (TVOC) కూడా సృజనాత్మకతను దెబ్బతీస్తాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. పరిశ్రమలు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో వర్క్ చేసే ఉద్యోగులపై ఈ ప్రభావం మరింత పడే అవకాశం ఉంటుందని అంటున్నారు. అధ్యయనంలో భాగంగా సింగపూర్‌లోని నాన్యాంగ్ టెక్నోలాజికల్ యూనివర్సిటీకి చెందిన సైంటిస్టులు 88 మంది ఎంప్లాయీస్ రోజూ పనిచేస్తున్న ఇండోర్ వర్క్‌స్పేస్‌లో తమ పరిశోధనలు కొనసాగించారు. విషపూరిత వాయువులు పీల్చుకోవడం వారి పనిసామర్థ్యం, సృజనాత్మకతపై ఎటువంటి ప్రభావం చూపుతుందో అబ్జర్వ్ చేశారు.

పరిశోధకులు ఈ సందర్భంగా ఉద్యోగుల్లో 54 మంది తరచుగా కార్బన్ డయాక్సైడ్, అస్థిర కర్బన సమ్మేళనాలు కలిగిన వాయువును పీల్చడంవల్ల ఇబ్బందులు ఎదర్కోవడాన్ని గుర్తించారు. పైగా టాక్సిక్ ఎయిర్ కారణంగా గందరగోళంగా ఉండటం, వర్కులో సామర్థ్యం, క్రియేటివిటీ ప్రదర్శించకపోవడం వంటి లక్షణాలను నిర్ధారించారు. అలాగే మరోసారి కూడా పరిశోధనలు నిర్వహించిన నిపుణులు వర్క్‌ప్లేస్‌‌లో అధిక అస్థిర కర్బన సమ్మేళనాలు కలిగిన వాయువులను పీల్చేవారు తక్కువ స్థాయి సృజనాత్మకను కలిగి ఉంటున్నట్లు పేర్కొన్నారు. అందుకే పర్యావరణంలోకి విషవాయువులు వెలువడకుండా ప్రపంచ దేశాలు జాగ్రత్త పడాలని హెచ్చరిస్తున్నారు. విషపూరిత వాయు కాలుష్యం వెలువడే అవకాశం ఉన్న ఏరియాల్లోని కార్యాలయాల్లో పనిచేస్తున్నప్పుడు తగిన కేర్ తీసుకోవాలని, విండోస్ క్లోజ్ చేయడం, గాలి నాణ్యతను పెంచే చర్యలను చేపట్టడం వంటివి చేయాలని సూచిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed