Viral Video : మను భాకర్‌ను పెళ్లి చేసుకోబోతున్న నీరజ్ చోప్రా..

by Sujitha Rachapalli |   ( Updated:2024-08-16 14:37:54.0  )
Viral Video : మను భాకర్‌ను పెళ్లి చేసుకోబోతున్న నీరజ్ చోప్రా..
X

దిశ, ఫీచర్స్ : పారిస్ ఒలింపిక్స్ లో మంచి ప్రతిభ కనబరిచారు మను భాకర్, నీరజ్ చోప్రా. మను రెండు కాంస్య పతకాలు సాధించగా.. నీరజ్ సిల్వర్ మెడల్ గెలిచాడు. భారత్ తరఫున స్టార్ పర్ఫార్మర్స్ గా నిలిచారు. అయితే తాజాగా వీరిపై సరికొత్త రూమర్ స్ప్రెడ్ అవుతుంది. ఈ ఇండియన్ ఆటగాళ్లు ఇద్దరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని టాక్ వినిపిస్తుంది. పారిస్ ఒలింపిక్ క్రీడలు ముగిశాక మను, ఆమె తల్లి, నీరజ్ ముగ్గురు కలిసి ఓ ఈవెంట్ లో కనిపించడం.. కుటుంబీకుల మాదిరిగా మాట్లాడుకోవడంతోపాటు నీరజ్, మను క్లోజ్ నెస్ ఈ గాసిప్స్ కు కారణమైంది.

కాగా ఈ విషయంపై స్పందించిన మను తండ్రి.. మను తల్లి నీరజ్ ను కొడుకులాగా ట్రీట్ చేస్తుందన్నాడు. ఆయన అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చాడు. మరో వైపు నీరజ్ అంకుల్.. 'ఒకవేళ నీరజ్ పెళ్లి జరిగితే.. సిల్వర్ మెడల్ వచ్చినప్పుడు దేశ ప్రజలకు అందరికి ఎలా తెలిసిందో అలాగే తెలుస్తుంది' అన్నాడు. మరోవైపు వైరల్ అవుతున్న వీడియోలపై స్పందిస్తున్న నెటిజన్లు.. అందులో తప్పేముంది అంటున్నారు. దేశం గర్వించేలా చేసిన ఈ ఇద్దరు అథ్లెట్స్ కు పిల్లలు పుడితే వారు కూడా మరిన్ని మెడల్స్ తెస్తారని అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed