చంద్రునిపై నుంచి ఆక్సిజన్‌ను వెలికి తీసిన నాసా సైంటిస్టులు

by Anjali |   ( Updated:2023-04-30 12:40:43.0  )
చంద్రునిపై నుంచి ఆక్సిజన్‌ను వెలికి తీసిన నాసా సైంటిస్టులు
X

దిశ, ఫీచర్స్: ఆక్సిజన్ నేలపైన, గాలిలో ఉంటుందని, దానిని వివిధ రూపాలుగా మార్చుకొని యూజ్ చేసుకోవచ్చని మనకు తెలుసు. అలాగే వివిధ పదార్థాల్లోనూ, మట్టిలోనూ అది మిళితమై ఉండటం కొన్ని రకాల జీవులు, మనుషులు, మొక్కలకు మేలు చేస్తుంది. మరి అదే ఆక్సిజన్ చంద్రుడిపై ఉంటే, అక్కడి నేలపై లేదా ఇసుకలో ఉన్న ఆక్సిజన్‌ను సేకరించగలిగితే..ఇక చంద్రమండలంపై మానవ కాలనీ కూడా ఏర్పాటు చేయడం సాధ్యం అవుతుందని నాసా సైంటిస్టులు భావిస్తున్నారు.

అక్కడ ఊపిరి పీల్చుకోవడానికి గల అవకాశాలతోపాటు, ఆక్సిజన్‌ను రవాణా కోసం ప్రొపెల్లెంట్‌గా ఉపయోగించవచ్చు. ఈ క్రమంలో తాజాగా నాసా శాస్త్రవేత్తలు చంద్రుని నేల నుంచి ఆక్సిజన్‌ను విజయవంతంగా సేకరించగలిగారు. శూన్య వాతావరణంలోమొదటిసారిగా గుర్తించబడిందని తెలిపిన సైంటిస్టులు.. ఏదో ఒక రోజు చంద్రునిపై మట్టి ద్వారా వనరులను వెలికితీసేందుకు మార్గం సుగమం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.



ఎలా వెలికితీశారు?

డర్టీ థర్మల్ వాక్యూమ్ ఛాంబర్ (Thermal Vacuum Chamber) అని పిలువబడే 15 అడుగుల వ్యాసం(15-foot diameter) కలిగిన ప్రత్యేక గోళాకార గదిని ఉపయోగించడం ద్వారా సైంటిస్టులు చంద్రునిపై కనిపించే మట్టిని, నేలను అక్కడి పరిస్థితులను టెస్టు చేశారు. ఇక్కడి అపరిశుభ్రమైన నమూనాలను లోపల పరీక్షించవచ్చని పేర్కొన్నారు. పరిశోధకుల బృందం సోలార్ ఎనర్జీ కాన్సంట్రేటర్ నుంచి వేడిని అనుకరించడానికి అధిక శక్తితో కూడిన లేజర్‌ను ఉపయోగించింది. కార్బోథర్మల్ రియాక్టర్‌లో చంద్రుడి మట్టిని కరిగించింది. ఈ రియాక్టర్‌లో ఆక్సిజన్‌ను వేడి చేయడం, వెలికితీసే ప్రక్రియ జరుగుతుంది.

దశాబ్దాలుగా భూమిపై సౌర ఫలకాలు, ఉక్కు వంటి వస్తువులను రూపొందించడానికి ఉపయోగించే ప్రక్రియ ఇదే. మట్టిని వేడి చేసిన తర్వాత, బృందం మాస్ స్పెక్ట్రోమీటర్ అబ్జర్వింగ్ లూనార్ ఆపరేషన్స్ (MSolo) అనే పరికరాన్ని ఉపయోగించి కార్బన్ మోనాక్సైడ్‌ను గుర్తించింది. 2023లో పోలార్ రిసోర్సెస్ ఐస్ మైనింగ్ ఎక్స్‌పెరిమెంట్-1 మాదిరిగానే, 2024లో నవంబర్‌లో నాసాకు చెందిన వోలాటైల్స్ ఇన్వెస్టిగేటింగ్ పోలార్ ఎక్స్‌ప్లోరేషన్ రోవర్ (VIPER)‌ను చంద్రుని దక్షిణ ధృవానికి రాబోయే రెండు ఎక్స్ ప్లోరేషన్ మిషన్‌లలో ప్రయాణించడానికి శాస్త్రవేత్తలు పంపనున్నారు. ఈ అధునాతన టెక్నాలజీ చంద్రుని ఉపరితలంపై ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేయడంతో పాటు చంద్రుడిపై నివాసాలకు దోహదం చేయనుంది.

ఇవి కూడా చదవండి:

డార్క్ చాక్లెట్ ఆరోగ్యానికి హానికరం !.. ‘కన్జ్యూమర్ రిపోర్ట్’ అధ్యయనంలో వెల్లడి

Advertisement

Next Story

Most Viewed