బృహస్పతిపై తుఫాను.. గంటకు 643 కి.మీ. వేగంతో ప్రచండ గాలులు.. ఫొటోలు రిలీజ్ చేసిన నాసా

by Dishafeatures2 |
బృహస్పతిపై తుఫాను.. గంటకు 643 కి.మీ. వేగంతో ప్రచండ గాలులు.. ఫొటోలు రిలీజ్ చేసిన నాసా
X

దిశ, ఫీచర్స్ : సౌర మండలంలోని అతి పెద్దగ్రహాల్లో జుపిటర్ (బృహస్పతి) ఒకటి. ఇది ఇతర గ్రహాల బరువుకంటే రెండున్నర రెట్లు అధికంగా ఉంటుందని ఖగోళ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. రోమన్ దేవత అయిన ‘జుపిటర్’పేరు మీదుగా దీనికా పేరు వచ్చిందని చెప్తారు. నిర్మలమైన ఆకాశంలోకి భూమిపై నుంచి చూస్తే చంద్రుడు, శుక్రుడు గ్రహాల తర్వాత కనిపించేదే జుపిటర్. గురు గ్రహం అని కూడా అంటారు. అయితే ప్రజెంట్ ఈ గ్రహంలో వాతావరణంపై పరిశోధనలు చేపడుతున్న నాసా సైంటిస్టులు 13 వేల కిలో మీటర్ల ఎత్తు నుంచి జునో క్రాఫ్ట్ అనే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి తీసిన ఫొటోలను విడుదల చేశారు.

నాసా సైంటిస్టుల ప్రకారం.. జుపిటర్‌పై ప్రస్తుతం రంగు రంగుల మేఘాలు కమ్ముకుంటున్నాయి. దీనివల్ల ఇక్కడ వాతావరణంలో తుఫానులు ఏర్పడుతున్నాయి. అయితే ఇక్కడ ఏర్పడే తుఫానులు దశాబ్దాలు లేదా శతాబ్దాలపాటు కొనసాగుతాయని సైంటిస్టులు అంటున్నారు. ఇప్పటికే బృహస్పతిని చుట్టు ముట్టిన తుఫానులు, అక్కడ ఘన ఉపరితల ప్రదేశం ఏదీ లేనందున వందల ఏండ్లు కొనసాగుతాయని, గంటకు 643 కి.మీ వేగంతో ప్రచండ గాలులు వీస్తాయని జుపిటర్ ఫొటోలను సోషల్ మీడియా వేదికలో పోస్ట్ చేసిన నాసా పేర్కొన్నది.



Next Story

Most Viewed