- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Eye health : ప్రతీ ముగ్గురిలో ఒకరికి ఆ సమస్య..! చిన్నారుల్లో దృష్టిలోపాలకు కారణం ఇదే..
దిశ, ఫీచర్స్ : ఒకప్పుడు ఏజ్ బార్ అయ్యాక మాత్రమే చాలా మందిలో కంటి చూపు మందగించేది. ఇప్పుడా పరిస్థితి మారిపోయింది. వయస్సుతో సంబంధం లేకుండా పిల్లలు, పెద్దలను సైతం ఈ సమస్య వేధిస్తోంది. వరల్డ్ ఆప్తమాలజీ రిపోర్ట్స్ ప్రకారం.. భారత దేశం సహా ప్రపంచ వ్యాప్తంగా ప్రతీ ముగ్గురు చిన్నారుల్లో ఒకరు ‘షార్ట్ సైటెడ్ నెస్’ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. అంటే కంటి చూపు తగ్గడం కారణంగా దూరంగా ఉన్న వస్తువులను చూడటంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వైద్య పరిభాషలో దీనిని ‘మయోపియా’ పేర్కొంటున్నారు ఆరోగ్య నిపుణులు.
పిల్లల్లో కంటి చూపు మందగించడానికి పోషకాహారలోపం, వివిధ అనారోగ్యాలు కూడా కారణం అవుతుంటాయి. కానీ నేటి డిజిటల్ యుగంలో ఫిజికల్ యాక్టివిటీస్ తగ్గి, స్క్రీన్ టైమ్ పెరగడమే మయోపియా వ్యాధికి కారణం అవుతోందని నివేదికలు పేర్కొంటున్నాయి. 1990 నుంచి ఈ సమస్య పెరుగుతూ వస్తోందని, 2050 నాటికి ప్రపంచ వ్యాప్తంగా మయోపియాతో బాధపడే చిన్నారుల సంఖ్య 74 కోట్లకు పెరిగే అవకాశం ఉందని చైనాలోని సున్ యాట్ సెన్ యూనివర్సిటీ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది.
ఇక ఆధునిక టెక్నాలజీ, స్క్రీన్ టైమ్ పెరగడం కారణంగా పిల్లలు ఎదుర్కొంటున్న చాలా కామన్ సమస్యగా షార్ట్ సైటెడ్ నెస్ లేదా మయోపియా ఉంటోంది. అయితే బాల్యంలో మొదలయ్యే ఈ సమస్య క్రమంగా కంటిచూపును పూర్తిగా కోల్పోయే ప్రమాదాన్ని పెంచే అవకాశం ఉందని కూడా జర్నల్ ఆఫ్ ఆప్తమాలజీ అధ్యయనాలు పేర్కొంటున్నాయి. చైనా పరిశోధకుల ప్రకారం.. 54 లక్షల మంది స్టాటిస్టిక్స్‌ను నిపుణులు పరిశీలించగా.. వీరిలో ఆసియా, ఆఫ్రికా కాంటినెంట్స్ నుంచి దాదాపు 50 దేశాలకు చెందిన వారు కంటి చూపు సమస్యను బాల్యంలోనే ఎదుర్కొంటున్నారని తేలింది. 5 నుంచి 19 ఏడ్ల మధ్య షార్ట్ సైటెడ్ నెస్ ఎదుర్కొంటున్న వాళ్లు దాదాపు 19 లక్షల మంది ఉన్నారు. డిజిటల్ మాధ్యమాల ద్వారా భోధనా పద్ధతులు, ఎక్కువ సమయం డిజిటల్ పరికాలు లేదా స్ర్కీన్లకు కేటాయించడం ఇందుకు కారణంగా ఉంటోంది. కాబట్టి రేపటి తరం దృష్టి లోపాలను ఎదుర్కో కూడదంటే నేటి బాల్యాన్ని ఆ దిశగా సిద్ధం చేయాలంటున్నారు నిపుణులు. స్ర్కీన్లకు తక్కువ సమయం కేటాయించేలా చూడాలని తల్లిదండ్రులకు సూచిస్తున్నారు.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.
Read More ...
Children's Day : బాల్యం.. సతమతం..! ఉరకలెత్తే ఉత్సాహంపై ఒత్తిడి, టెక్నాలజీ ప్రభావం !!