- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
MUST TRY: ప్రెగ్నెన్సీ టైమ్‌లో వచ్చే వాంతులని తగ్గించడానికి బెస్ట్ చిట్కాలు ఇవే!!
దిశ, ఫీచర్స్: సాధారణంగా ప్రెగ్నెన్సీ టైమ్‌లో వాంతులు కావడం కామన్. దాని వలన సరిగ్గా ఫుడ్ తీసుకోకుండా నీరసం అయిపోతారు. అలాగే ఈ టైమ్‌లో ప్రయాణాలు చేయడం, యాసిడ్ రిఫ్లక్స్ కారణాల వలన వికారం మరింత ఎక్కువైపోతుంది. తరచుగా త్రేన్పులు రావడం, నిలబడలేక పోవడం వంటివి ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే ఇలా వాంతులు కాకుండ ఉండటం కోసం ఈ 3 సాధారణ ఇంటి చిట్కాలు పాటిస్తే సరి.. అవేంటో ఇప్పుడు చూద్దాం..
అల్లం:
అల్లం ప్రతి ఒక్కరి ఇంట్లో కచ్చితంగా లభిస్తుంది. దీని వలన చాలా లాభాలు ఉన్నాయి. అందులో భాగంగా వికారం, వాంతులు, కడుపు ఉబ్బరం, లేదా జీర్ణ సంబంధ రోగాలకు బెస్ట్ మెడిసిన్‌లా పని చేస్తుంది. ఒక చిన్న తాజా అల్లం ముక్కను నమలడం, లేదా వంటలో వాడటం, లేదా అల్లం టీ చేసుకొని తాగడం వలన వాంతులు తగ్గే ఛాన్స్ ఉంటుంది.
నిమ్మకాయ:
వికారంగా ఉన్నప్పుడు, నిమ్మకాయలోని రిఫ్రెషింగ్ టేస్ట్ అద్భుతంగా పనిచేస్తుంది. నిమ్మరసంలో వికారాన్ని కలిగించే ఆమ్లాలను సరి చేయగల గుణాలు ఉంటాయి. ఇవి వికారం నుండి ఉపశమనాన్నిచ్చే బైకార్బోనేట్ సమ్మేళనాలను విడుదల చేస్తాయి. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో, నిమ్మరసం, చిటికెడు ఉప్పు వేసి కలిపి, తీసుకోవడం మంచిది. లేదా గ్రీన్ టీలో తేనె, నిమ్మరసం కలిపి తీసుకోవచ్చు.
పుదీనా ఆయిల్:
చేతి మీద కొన్ని చుక్కల పిప్పరమింట్ ఎసెన్షియల్ ఆయిల్ వేసి రుద్దుకుని, వాసన చూడటం వలన వాంతులు తగ్గడానికి సహాయపడుతుంది. ఒక అధ్యయనం ప్రకారం, పిప్పరమింట్ అరోమా థెరపీ, అన్ని సందర్భాల్లోనూ వికారాన్ని 75 శాతం వరకు తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుందని తేలింది.
గమనిక:పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహన కోసం మాత్రమే దీనిని అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు సంబంధించి ‘దిశ’ ఎటువంటి బాధ్యత వహించదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించడం ఉత్తమం.