Moon moving : చందమామ దూరం.. దూరం.. ఆ మార్పు దేనికి సంకేతం?

by Javid Pasha |
Moon moving : చందమామ దూరం.. దూరం.. ఆ మార్పు దేనికి సంకేతం?
X

దిశ, ఫీచర్స్: చల్లని రాత్రి.. వెన్నెల రేయి.. నిర్మలమైన ఆకాశంలో వెలుగులు విరజిమ్ముతున్న చందమామను చూసి మురిసిపోని వారంటూ ఎవరూ ఉండరు. చిన్నప్పుడు ఇంటి బయట వాకిట్లో నిల్చుని చంద మామ రావే.. దాయి.. దాయి చందమామా.. అంటూ పైకి చూపిస్తూ గోరు ముద్దలు తినిపించిన అమ్మ జ్ఞాపకాలు ప్రతీ ఒక్కరి గుండెలో పదిలంగా ఉండే ఉంటాయి. ఇదంతా పక్కన పెడితే.. నిరంతర పరిశోధనల్లో భాగంగా సైంటిస్టులు ఇప్పటికే చంద్రుడి దక్షిణ ధ్రువంపై కాలు మోపిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్-మాడిసన్‌కు చెందిన పరిశోధకులు మరో కొత్త విషయాన్ని కూడా కనుగొన్నారు. ఏంటంటే.. చంద్రుడు రోజు రోజుకూ భూమికి దూరమైపోతున్నాడు.

పరిశోధనల్లో భాగంగా శాస్త్రవేత్తలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా చంద్రుడు - భూమికి మధ్య జరుగుతున్న పరిణామాలను పరిశీలించారు. అంతేకాకుండా అక్కడ 90 మిలియన్ సంవత్సరాల పురాతనమైన రాతి నిర్మాణంపై కూడా దృష్టి సారించారు. ఈ సందర్భంగా వారు కనుగొన్నది ఏమిటంటే.. చంద్రుడు నిజానికి స్థిరంగా ఉండటం లేదు. ఏడాదికి 3.8 సెంటీ మీటర్ల చొప్పున భూమి నుంచి దూరంగా జరిగిపోతున్నాడు.

శాస్త్రవేత్తల ప్రకారం.. చంద్రుడు ప్రతీ సంవత్సరం భూమికి దూరంగా వెళ్లే పరిస్థితివల్ల సుదీర్ఘ భవిష్యత్తులో భూమిపై ఉండే సమయం, రోజుల వ్యవధిపై ప్రభావం చూపుతుంది. అంటే ప్రజెంట్ ఇక్కడ రోజుకు 24 గంటలుగా ఉంటున్న సమయం.. రాబోయే కాలంలో రోజుకూ 25 గంటలకు మారవచ్చునని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. కాకపోతే అది ఇప్పట్లో జరిగే అవకాశం లేదని, దాదాపు 200 మిలియన్ సంవత్సరాల జరుగుతుందని సైంటిస్టులు అంటున్నారు. 1.4 మిలియన్ సంవత్సరాల క్రితం కూడా భూమిపై సమయం ఇప్పటిలా ఉండేది కాదట. అప్పట్లో రోజుకూ కేవలం 18 గంటలు ఉండేదని, చంద్రుడు క్రమంగా భూమికి దూరం అవుతూ రావడంవల్ల అది కాస్త ఇప్పుడున్న 24 గంటలకు మారిందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. భవిష్యత్తులోనూ గణనీయమైన మార్పులు రానున్నాయని వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed