- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Beauty tips:రోజ్ వాటర్‌లో ఇది కలిపి రాస్తే.. గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం
దిశ, ఫీచర్స్: రోజ్ వాటర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లేడీస్ అందాన్ని రెట్టింపు చేయడంలో రోజ్ వాటర్ సహాయపడుతుంది. పొడిబారిన చర్మాన్ని తేమగా ఉంచడంతో పాటుగా మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను తొలగించడంలో ఉపయోగపడుతుంది. ఇది మాత్రమే కాకుండా విటమిన్-ఇ చర్మాన్ని ఆరోగ్యంగా కాంతివంతంగా మార్చడానికి సహాయపడుతుంది. ఇందులో మాయిశ్చరైజింగ్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. దీనిని మూఖానికి రాయడం వల్ల ఫ్రీ రాడికల్స్ నుంచి చర్మాన్ని కాపాడుతుంది. అయితే, ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఈ రెండిటిని మిక్స్ చేసి ముఖానికి రాయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మరి ఈ రెండిటిని కలిపి ఎలా ఉపయోగించాలో ఇక్కడ చదివేయండి.
విటమిన్-ఇ: విటమిన్-ఇ అనేది శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. ఇది పొడిబారిన చర్మాన్ని తేమగా మార్చి, స్కిన్ కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది. చర్మంపై ఉన్న డెడ్ స్కిన్, మొటిమలు, మచ్చలను తొలగిస్తుంది. అంతేకాకుండా వృద్ధాప్య లక్షణాలను కూడా తగ్గించడంలో సహాయపడుతుంది. కంటికింద నల్ల మచ్చలు ఉన్న వారికి విటమిన్-ఇ క్యాప్సిల్ ఉపయోగపడుతుంది.
రోజ్ వాటర్: ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు చర్మాన్ని కాంతివంగా మార్చడంలో సహాయపడతాయి. ఆయిల్ స్కిన్ ఉన్న వారు రోజ్ వాటర్‌ను ఉపయోగిస్తే ప్రయోజనం ఉంటుంది. అంతేకాకుండా చర్మాన్ని మృదువుగా ఉంచి, మెరిసేలా చేస్తుంది. ఇందులోని ఆస్ట్రిజెంట్ గుణాలు చర్మంపై ఉన్న రంధ్రాలను మూసివేసి, స్కిన్‌పై ఉన్న ముడతలను తగ్గిస్తుంది.
అప్లై చేసే విధానం:
ముందుగా ఒక గిన్నెలో 2 లేదా 3 స్పూన్ల రోజ్ వాటర్‌ను తీసుకొని, అందులో ఒక విటమిన్-ఇ క్యాప్సూల్ నూనెను పిండి, రెండిటిని బాగా కలుపుకోవాలి. ముందుగా మంచి నీటితో ముఖాన్ని శుభ్రంగా చేసుకోవాలి. ఆ తరువాత ఈ మిశ్రమాన్ని ముఖంపై మసాజ్ చేస్తూ అప్లై చేయాలి. అలా 20 నిమిషాలు ఉంచిన తరువాత చల్లటి నీటితో కడిగేయాలి.
ఈ రెండు చర్మాన్ని కాంతివంతంగా మెరిసేలా చేసి, స్కిన్‌ను మృదువుగా మార్చుతుంది. చాలామంది ఈ విటమిన్-ఇ క్యాప్సూల్స్‌ని నేరుగా ముఖానికి రాస్తుంటారు. అలా కాకుండా ఇలా రోజ్ వాటర్‌ను ఉపయోగించే రాస్తే ఫలితం ఉంటుంది.
*గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు.
Read More...
Fitness : పవర్ లిఫ్టింగ్‌తో మోస్ట్ బెనిఫిట్స్.. సెలబ్రిటీలు ఫాలో అయ్యేది అందుకేనా?