Smart Phone: స్మార్ట్ ఫోన్ యాడ్స్‌‌లో AI ఫీచర్స్ హైలెట్ చేస్తే తగ్గుతున్న సేల్స్.. షాక్ ఇస్తున్న కారణాలు

by Sujitha Rachapalli |   ( Updated:2024-08-01 12:09:38.0  )
Smart Phone: స్మార్ట్ ఫోన్ యాడ్స్‌‌లో AI ఫీచర్స్ హైలెట్ చేస్తే తగ్గుతున్న సేల్స్.. షాక్ ఇస్తున్న కారణాలు
X

దిశ, ఫీచర్స్: ఈ మధ్య స్మార్ట్ ఫోన్, లాప్ టాప్ కు సంబంధించిన యాడ్స్ లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తప్పకుండా ఉంటుంది. దీనివల్ల సేల్స్ ఎక్కువ పెరుగుతాయని అనుకుంటున్నాయి కంపెనీలు. కానీ లేటెస్ట్ వాషింగ్టన్ యూనివర్సిటీ పరిశోధకుల అధ్యయనం మాత్రం మార్కెటర్స్ కు షాక్ ఇచ్చే విషయాలను ప్రకటించింది. AI గురించి ప్రస్తావించక పోవడమే మంచిదని.. లేదంటే అమ్మకాలు పడిపోయే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇందుకు గల కారణాలను వివరించింది.

  • AI అనే పదం ఎమోషనల్ ట్రస్ట్ తగ్గిస్తుంది. వాల్యూలెస్ గా పరిగణించబడుతుంది. ముఖ్యంగా అధిక ధర కలిగిన ఎలక్ట్రానిక్ డివైస్ విషయాల్లో కస్టమర్స్ ఇలా ఫీల్ అవుతున్నారు.
  • అందుకే ఏఐ బజ్ వర్డ్ వాడకుండా క్లియర్ బెనిఫిట్స్ పై ఫోకస్ చేయాలని సూచిస్తున్నారు పరిశోధకులు.
  • వెయ్యి మందికి పైగా అమెరికన్లు పాల్గొన్న సర్వేలో ఈ ఫలితాలను గుర్తించారు. ఇందులో ఎనిమిది వేర్వేరు ఉత్పత్తి, సేవా వర్గాలను కవర్ చేయగా.. ప్రతి సందర్భంలోనూ AIని వాడటం ప్రతికూలమైనదిగా గుర్తించబడింది.
  • కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నవారికి AI ఆశించినంత ప్రభావం చూపకపోవచ్చని ఈ అధ్యయనం సూచిస్తుంది. కేవలం AI ఫీచర్‌లపై దృష్టి పెట్టే బదులు... ఫోన్ ఓవరాల్ పర్ఫార్మెన్స్, వినియోగదారు అనుభవం, విశ్వసనీయత, వారి అవసరాలకు అనుగుణంగా ఎలా ఉన్నాయో ప్రకటనలో వాడటం బెస్ట్ ఆప్షన్ గా చెప్తుంది.
Advertisement

Next Story

Most Viewed