Mathura Peda : బ్రిటన్ రాణి విక్టోరియాకు ఫేవరెట్ స్వీట్.. ఎందుకంత స్పెషల్..

by Sumithra |   ( Updated:2024-08-29 06:21:20.0  )
Mathura Peda : బ్రిటన్ రాణి విక్టోరియాకు ఫేవరెట్ స్వీట్.. ఎందుకంత స్పెషల్..
X

దిశ, వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డెస్క్ : బ్రిటీష్ రాజుల కాలంలో భారతదేశం బ్రిటీష్ వారి నుండి రైల్వేలు, పోస్టల్ వ్యవస్థ వంటి అనేక సదుపాయాల గురించి తెలుసుకుంది. అలాగే భారతదేశం నుండి బ్రిటిష్ వారు కూడా అనేక విషయాలు తెలుసుకున్నారు. అలాగే అనేక విలువైన వస్తువులను కూడా తీసుకున్నారు. విలువైన వస్తువు అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది కోహినూరు వజ్రం. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకునేది దాని గురించి అస్సలే కాదు. మరి ఏంటి అనుకుంటున్నారా అది తినదగిన వస్తువు.. దాని పేరు 'మధుర పెడా'. ఇది భారతదేశంలోని ఒక పెడా తయారీ దుకాణంలో దొరుకుతుంది. 160 సంవత్సరాలకు పైగా ఈ దుకాణం ఫుల్ సక్సెస్ గా నడుస్తోంది. ఇక్కడ తయారు చేసిన పెడా ఒకప్పుడు బ్రిటిష్ రాజకుటుంబానికి చెందిన డైనింగ్ టేబుల్‌ కే మెయిన్ మెనూగా ఉండేదట.

1860లో దుకాణం ప్రారంభం..

గుజరాత్‌లోని వడోదరకు చెందిన 'పెండవాలా దులిరామ్ రతన్‌లాల్ శర్మ' అనే ప్రసిద్ధ పేడా దుకాణం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాము. ఇది 1860 ల ప్రారంభంలో రాజ్‌పురా రోడ్‌లో ప్రారంభమైంది. నిజానికి ఈ దుకాణానికి మధురతో మంచి సంబంధం ఉంది. మిఠాయి వ్యాపారి దులిరామ్ జీ, మహారామ్ జీ అనే ఇద్దరు సోదరులు అక్కడ ఈ దుకాణాన్ని ప్రారంభించారు. అయితే ఆ తర్వాత గుజరాత్‌కు షిఫ్ట్ అయ్యారు. నేటికీ అనేక తరాల తర్వాత వీరి కుటుంబానికి చెందిన జతిన్ శర్మ, హిమాన్షు శర్మ ఈ బ్రాండ్ గుర్తింపును కొనసాగిస్తున్నారు. ఇప్పుడు వారు తయారు చేసే పేడా నగరంలోని అనేక ప్రాంతాల్లో అమ్ముడవుతోంది.

క్వీన్ విక్టోరియాకి ఫేవరేట్..

ఈ దుకాణంలోని స్వీట్లు బ్రిటన్ రాణి విక్టోరియాకు ఎలా చేరాయనడానికి ఆసక్తికరమైన కథనం ఉంది. బ్రిటీష్ రాజకుటుంబానికి స్వీట్లు చేరుకోవడానికి ముందు వడోదరలోని గైక్వాడ్ రాజకుటుంబంలో చోటు సంపాదించాయి. ఒకప్పుడు మహారాజా ఖండేరావ్ గైక్వాడ్ II ఏనుగు పై కూర్చొని ఈ దుకాణం గుండా వెళ్ళారట. కానీ అతని ఏనుగు దుకాణం ముందు ఆగి, ఇక్కడ నుండి పెడాలు తినిపించే వరకు ముందుకు సాగడానికి సిద్ధంగా ఉండేది కాదట. దాంతో రాజుకూడా ఈ పేడాల రుచికి ముగ్ధుడయ్యాడట.

ఈ సంఘటన తర్వాత ఈ దుకాణం కీర్తి చాలా వరకు వ్యాపించింది. తర్వాత వడోదర మహారాజా సాయాజీరావు గైక్వాడ్ III ఈ దుకాణం నుండి క్వీన్ విక్టోరియాకు పెడాల రుచిని పరిచయం చేశారు. దీన్ని రుచి చూసి విక్టోరియా ఎంతగానో ఇష్టపడేవారట. ఆ తర్వాత బ్రిటీష్ రాజకుటుంబం చేసే విందులలో ఈ పేడాను ఫేవరేట్ డెజర్ట్‌గా వడ్డించేవారట.

Advertisement

Next Story