- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Fish - Pregnancy; కడుపుతో ఉన్నప్పుడు చేపలు తింటే.. పుట్టబోయే పిల్లల్లో ఈ సమస్య ఉండదా? పరిశోధనలు ఏం చెప్తున్నాయి?
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా(USA) ఆటిజంతో బాధపడుతున్న పిల్లల సంఖ్య పెరిగిపోతుంది. ఇందుకు కారణమేంటో తెలుసుకునేందుకు చేపట్టిన తాజా అధ్యయనం.. ఓ సొల్యూషన్ తో వచ్చింది. గర్భధారణ సమయంలో(pregnancy Period) చేపలు తినడం వల్ల ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ (ASD) కు గురయ్యే అవకాశం 20శాతం తక్కువగా ఉందని గుర్తించింది. కడుపులో పెరుగుతున్న పిండం మెదడు అభివృద్ధికి దోహదం చేస్తుందని వివరించింది. సుమారు 4000 మంది పాల్గొన్న అధ్యయనంలో ఈ ఫలితాలు గుర్తించారు పరిశోధకులు.
అయితే ఫిష్ లో ఉండే ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్ ఆటిజం సమస్యను తగ్గిస్తున్నాయా అని గుర్తించాలని అనుకున్న శాస్త్రవేత్తలు.. ఒమేగా - 3 సప్లిమెంట్స్ వల్ల కూడా ఇలాంటి బెనిఫిట్స్ ఉంటాయా అని పరిశీలించారు. సప్లిమెంట్ వినియోగం, ఆటిజంకు సంబంధించిన న్యూరో డెవలప్‌మెంటల్ ఫలితాల మధ్య సంబంధాలను పరిశీలించారు. కానీ ఈ సప్లిమెంట్స్ వల్ల ఎలాంటి లాభం లేదని గుర్తించారు. గర్భంతో ఉన్నప్పుడు వారానికి ఒక్కసారి అయినా ఫిష్ తీసుకోవడం వల్ల పిల్లల్లో అభిజ్ఞా సామర్థ్యాలు అధికంగా ఉంటాయని సూచించారు.