- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Massive solar storms: సూర్యునిపై భారీ సౌరతుఫానులు.. భూమికి ముప్పు తప్పదా..?
దిశ వెబ్ డెస్క్: ఈ భూమి మీద జీవరాశి మనుగడలో కాంతి ప్రధాన పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈ భూమి మీద జీవరాసి బతకడానికి గాలి, నీరు, ఆహారం అవసరం. అయితే ఆ భూమిపై జీవరాసి పుట్టుకకు కాంతి చాలా అవసరం. ఒక్క మాటలో చెప్పాలంటే.. సూర్యుడికి భూమికి మధ్య ఉన్న సంబంధం భూమిపై ఉండే జీవవైవిధ్యం, సముద్ర ప్రవాహాలు, వాతావరణాన్ని నడిపిస్తుంది.
కాగా సూర్యుడు భూమికి చాలా దగ్గరగా ఉన్న ఓ నక్షత్రం. అందుకే సూర్యుడు ప్రకాశిస్తూ ఉంటాడు. ఇక ఎప్పుడూ భగభగ మండుతూ ఉండే భానుడు ప్రతి 11 సంవత్సరాలకు ఒకసారి కొత్త సౌర చక్రంలోకి ప్రవేశిస్తాడు. దీని కారణంగా సూర్యుడి అయస్కాంత క్షేత్రం మారుతుంది. అంటే సూర్యుని ఉత్తర, దక్షిణ ధ్రువాల స్థానాలు మారతాయి.
దీని కారణంగా కొత్తగా ఏర్పడే సౌర వ్యవస్థలో గ్రహాలు కూడా భాగం అవుతాయి. అయితే ప్రస్తుతం నడుస్తోన్న సౌర చక్రంలో కార్యకలాపాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. సూర్యుడి ఏర్పడ్డుతున్న సౌరతుఫానులు భూమిపై ఉన్న సాధారణ జీవరాశిపై తీవ్ర ప్రభావాన్ని చూపనున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం, అనగా మే 2, 3 తేదిల్లో సూర్యునిపైన సన్‌స్పాట్ AR3663 వద్ద అత్యంత శక్తివంతమైన భారీ సౌరతుఫానులు ఏర్పడ్డాయని శాస్త్రవేత్తలు తెలిపారు.
కాగా ఈ సౌరతుఫానుల వల్ల భూమికి ప్రమాదం పొంచి ఉందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మే 2న ఏర్పడిన మొదటి సౌరతుఫానును X- తరగతికి చెందిన సౌరజ్వాలగా పరిగనించారు. అలానే ఇది సౌర జ్వాలల్లోకెల్లా అత్యంత శక్తివంతమైందని పేర్కొన్నారు. కాగా ఈ సౌరజ్వాల ఆస్ట్రేలియా, జపాన్, చైనాలో చాలా వరకు షార్ట్‌వేవ్ రేడియో బ్లాక్‌అవుట్‌లకు కారణమవుతుందని వెల్లడించారు.