వాసిలెన్ డబ్బా చిన్న గా ఉందిగా అని లైట్ తీసుకోకండి.. దీనితో బోలెడు లాభాలు!

by Jakkula Samataha |
వాసిలెన్ డబ్బా చిన్న గా ఉందిగా అని లైట్ తీసుకోకండి.. దీనితో బోలెడు లాభాలు!
X

దిశ, ఫీచర్స్ : శీతాకాలం వస్తే చాలు చాలా మంది ఇంట్లో వాసెలిన్ చిన్న చిన్న డబ్బాలు దర్శనం ఇస్తుంటాయి. అయితే చాలా మంది చిన్న వాసెలిన్ డబ్బే కధా అని చాలా చీప్‌గా చూడటం లాంటిది చేస్తారు కానీ, దీని వలన అనేక లాభాలు ఉన్నాయంటున్నారు నిపుణులు అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.

1. వాసెలిన్ ప్రథమ చికిత్సగా ఉపయోగిస్తారంట. ఏవైనా గాయలు అయినప్పుడు లేదా గాలిన గాయలపై దీనిని రాయడం వలన గాయం త్వరగా మానడానికి ఉపయోగ పడుతుందంట.

2. శీతాకాలంలో చర్మం పొలుసులుగా మారి పగలడం లాంటిది జారుగుతుంది. అయితే శీతాకాలంలో మన చర్మన్ని ఇది పొడి బారకుండా రక్షిస్తుందంట.

3. ఆడవారికి అందం కనురెప్పలు అందం. అయితే కనురెప్పను కాపాడటంలో కూడా వాసెలిన్ ముఖ్య పాత్ర పోషిస్తుందంట.

4. మేకప్ రిమూవర్‌గా , అలాగే మేకప్ ఎక్కువ సేపు ఉండేందుకు కూడా వాసెలిన్ ఉపయోగపడుతుందంట.

5. పెదాలను రక్షించి, అవి చీరిపోకుండా , చాలా సాఫ్ట్‌గా ఉండేలా చేస్తుంది.

6, ఇంట్లో ఉన్న కాస్లీ ఫర్నీచర్ మరకలు తుడవడానికి ఇది ఉపయోగపడుతుందంట.

7. నెయిల్ పాలిష్ క్యాప్స్‌ను తొలగించడం చాలా కష్టం. కానీ ఈ వాసెలిన్ ద్వారా చాలా సులభం అంంట. క్యాప్‌పై వాసెలిన్ పూస్తే కొద్ది సేపటి తర్వాత క్యాప్స్ తొలిగిపోతాయంట.

8. లెదర్ షూస్ శుభ్రం చేయడానికి, వాటిని మెరిసేలా చేయడానికి వాసెలిన్ గ్రేట్ గా సహాయపడుతుంది. బూట్లకు వాసెలిన్ రాసి, గుడ్డతో రుద్దితే నిమిషాల్లో షూస్ కొత్తవిగా మెరిసిపోతాయి.

Advertisement

Next Story

Most Viewed