చెంప దెబ్బ కొట్టేలా చరిత్ర సృష్టించిన మంచు విష్ణు.. వారికి కరెక్ట్ ఆన్సర్

by Sujitha Rachapalli |   ( Updated:2024-05-21 06:03:59.0  )
చెంప దెబ్బ కొట్టేలా చరిత్ర సృష్టించిన మంచు విష్ణు.. వారికి కరెక్ట్ ఆన్సర్
X

దిశ, సినిమా : కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అంగరంగ వైభవంగా జరుగుతుంది. సెలబ్రిటీలు తమ అవుట్ ఫిట్స్, అందాలతో కళ్లకు ఆనందాన్ని పంచుతున్నారు. ఇండియా నుంచి ఐశ్వర్యా రాయ్, శోభిత ధూళిపాళ, ఊర్వశి రౌతేలాతోపాటుగా పలువురు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, నటీనటులు పాల్గొన్నారు. ఇక తెలుగు సినిమా నుంచి మంచు విష్ణు ఫ్యామిలీ రెడ్ కార్పెట్ పై నడిచి చరిత్ర సృష్టించారు. ' హారిజన్: యాన్ అమెరికన్ సాగా ' మూవీ స్క్రీనింగ్ కు ప్రభుదేవాతో కలిసి మోహన్ బాబు, మంచు విష్ణు దంపతులు హాజరయ్యారు. ఈ విషయాన్ని విష్ణు సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు.

ఇక ఇదే ఫెస్టివల్ లో విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ' కన్నప్ప ' టీజర్ లాంచింగ్ కూడా జరగబోతుంది. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ లాంటి స్టార్స్ నటిస్తున్న సినిమాను ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. కాగా దీనిపై రియాక్ట్ అవుతున్న మీమర్స్.. ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. టోల్ చేస్తూ తాము ఇక్కడే ఉండిపోతే టైట్ స్లాప్ ఇచ్చినట్లుగా ఆయన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్ పై నడిచాడని అంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed