- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ పండు చూస్తే మగ ఎలుకలకు భయమంట.. ఎంత విచిత్రం..?!
దిశ, వెబ్‌డెస్క్ః కొన్ని భయాలు చాలా విచిత్రంగా ఉంటాయి. అందులోనూ దొరికినదాన్నల్లా కొరికి నాశనం చేస్తే ఎలుకలు ఒక పండుకు భయపడటం చాలా విచిత్రంగానే అనిపిస్తుంది. నిజమే! మగ ఎలుకలు అరటిపండ్లకు భయపడతాయని తాజా అధ్యయనం వెల్లడించింది. క్యూబెక్‌లోని మాంట్రియల్‌లోని మెక్‌గిల్ యూనివర్శిటీ పరిశోధకులు ఈ అసాధారణ విషయాన్ని గుర్తించారు. గర్భిణీ, బాలింత ఎలుకల దగ్గరున్న మగ ఎలుకలలో ఒత్తిడి హార్మోన్ల పెరుగుదలను విశ్లేషించడానికి చేసిన అధ్యయనంలో శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని గ్రహించారు. మగ ఎలుకల్లో హార్మోన్ల మార్పులు, ఆడవారి మూత్రంలో n-పెంటిల్ అసిటేట్ అనే సమ్మేళనం ఉండటం వల్ల ఇలాంటి పరిస్థితి వస్తున్నట్లు. ఇక, ఇదే సమ్మేళనం అరటిపండ్లకు ప్రత్యేకమైన వాసనను కూడా ఇస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. సదరు అధ్యయన ఫలితాలు మే 20 న 'సైన్స్ అడ్వాన్సెస్' జర్నల్‌లో ప్రచురించారు.
"ఈ ఫలితం మాకు ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే, మేము దీని కోసం ప్రత్యేకంగా వెతకడం లేదు. ఇది అనుకోకుండా కనుగొన్నాము. గర్భిణీ ఎలుకల్ని మరొక ప్రయోగం కోసం మా ల్యాబ్‌లో ఉంచాము. వాటి దగ్గరున్న మగ ఎలుకలు వింతగా ప్రవర్తించడం ప్రారంభించినట్లు మా గ్రాడ్యుయేట్ విద్యార్థి గ్రహించారు" అని అధ్యయనం సీనియర్ రచయిత, మెక్‌గిల్ విశ్వవిద్యాలయంలోని సైకాలజీ విభాగం ప్రొఫెసర్, జెఫ్రీ మొగిల్, లైవ్ సైన్స్‌తో చెప్పారు. ఈ రీసెర్చ్ పేపర్లో, శాస్త్రవేత్తలు "మగ ఎలుకలు, ముఖ్యంగా కన్య పురుషులు, తమ జన్యుపరమైన సామర్థ్యాన్ని ముందుకు తీసుకెళ్లడానికి శిశుహత్యల్లో దూకుడు ప్రదర్శిస్తాయి" అని పేర్కొన్నారు. వాటిని దూరంగా ఉంచడానికి గర్భిణీ, బాలింత ఎలుకలు కెమోసిగ్నలింగ్‌పై ఆధారపడతారు. అంటే శరీరాల ద్వారా రసాయన ప్రతిస్పందనలను విడుదల చేయడం, మగవారు తమ సంతానం దగ్గరికి రాకుండా సందేశాలు పంపడం వంటి చర్యలు జరగుతాయి. ఆడ ఎలుకల మూత్రంలో రసాయనాలకు ప్రతిస్పందనగా మగవారిలో ఒత్తిడి స్థాయిలు పెరగడాన్ని గమనించినప్పుడు, వేరే మూలం నుండి n-పెంటైల్ అసిటేట్ కూడా అదే ప్రతిస్పందనను ప్రేరేపిస్తున్నట్లు తెలిసి పరిశోధకులు ఆశ్చర్యపోయారు. దీంతో స్థానిక సూపర్‌మార్కెట్ నుంచి అరటి నూనెను తెచ్చి దూదిపై వేసి మగ ఎలుకల బోనులో ఉంచారు. ఇది మగవారిలో ఒత్తిడి స్థాయిని పెంచింది.