- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వేసవి వచ్చేస్తోంది.. ట్రిప్ కోసం ఇప్పటి నుంచే ఈ సన్నాహాలు చేసుకోండి..
దిశ, ఫీచర్స్ : వింటర్ సీజన్‌లో చిన్న పిల్లలతో ట్రిప్ ప్లాన్ చేయడం కష్టం ఎందుకంటే మారుతున్న ఉష్ణోగ్రతల కారణంగా పిల్లలు త్వరగా అనారోగ్యానికి గురవుతారు. అంతే కాదు సెలవులు లేకపోవడంతో ట్రిప్ ని ఎంజాయ్ చేయలేరు. దాంతో పిల్లలు, పెద్దలు వేసవి ప్రారంభమై పాఠశాలలకు, కళాశాలలకు సెలవులు రాగానే ఎక్కడికైనా లాంగ్ టూర్ కి వెళ్లాలని అనుకుంటారు. పిల్లలు ఏడాది పొడవునా చదువులో బిజీగా ఉండి అలసిపోవడంతో పేరేంట్స్ కూడా వెకేషన్ ప్లాన్ చేస్తారు. ఇలాంటి ట్రిప్స్ ప్లాన్ చేసే సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. మరి ఆ జాగ్రత్తలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ట్రిప్ కి ముందు ఇలా ప్లాన్ చేసుకోండి..
1. జాగ్రత్తగా ప్యాకింగ్ చేయడం..
బట్టలు సర్దుకునే ముందు ఏయే క్లాత్స్ అవసరమో ముందే పెట్టుకోవాలి. ఇలా చేయడం ద్వారా మీ బ్యాగ్ ఓవర్‌లోడ్ కాకుండా బ్యాగ్ సులభంగా సరిపోతుంది. మీరు చిన్న పిల్లలతో కలిసి విహారయాత్రకు వెళుతున్నట్లయితే, మీ బట్టల ప్యాకింగ్‌ను సరళంగా, సౌకర్యవంతంగా ఉంచాలి. మీ దుస్తులకు అనుగుణంగా మేకప్ కిట్ ను పెట్టుకోండి. ఈ విధంగా, స్మార్ట్ ప్యాక్ చేయడం ద్వారా మీ బ్యాగ్ బరువు తక్కువగా ఉండి అవసరమైన అన్ని వస్తువులను తీసుకెళ్లవచ్చు.
2. మందులను తప్పకుండా పెట్టుకోవాలి..
ట్రిప్ కోసం ప్యాకింగ్ చేస్తున్నప్పుడు, మందులను మీతో క్యారీ చేయడం మర్చిపోవద్దు. మీకు అవసరమైన మందులే కాకుండా తలనొప్పి, వాంతులు, విరేచనాలు, జ్వరం, కడుపునొప్పి మొదలైన మందులను ఉంచుకోవడం మర్చిపోవద్దు. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ఎటువంటి సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరం లేదు.
3. స్నాక్స్ పెట్టుకోవడం మర్చిపోవద్దు..
సమ్మర్ ట్రిప్స్ లో బయటి ఆహారాన్ని ఎక్కువగా తినడం వల్ల మీరు అనారోగ్యానికి గురవుతారు. నిజానికి ఈ సీజన్‌లో వేపుడు పదార్థాలను ఎక్కువగా తినడం వల్ల చాలామంది ఆరోగ్యం పాడవుతుంది. అందువల్ల మీరు వేసవి పర్యటనల కోసం మీతో ఇంట్లో తయారు చేసిన స్నాక్స్ తీసుకువెళ్లాలి. దీంతో బయటి ఆహారం తినకుండా ఉంటారు.