గులాబ్ జామూన్‌తో కొత్త రెసిపీ .. పిచ్చెక్కిపోతున్న పిజ్జా లవర్స్..

by Sumithra |   ( Updated:2024-03-17 08:07:05.0  )
గులాబ్ జామూన్‌తో కొత్త రెసిపీ .. పిచ్చెక్కిపోతున్న పిజ్జా లవర్స్..
X

దిశ, ఫీచర్స్ : కొంతమందికి వంటలు చేయడం అనేది ఒక ప్యాషన్. అలాంటి వారు రెగ్యులర్ గా చేసే వంటలు కాకుండా కొత్త కొత్త వంటల ప్రయోగాలు చేస్తూ ఉంటారు. దేశంలో ఎక్కడా లేని కొత్త రుచులను కనిపెడుతూ ఉంటారు. అలాంటి ఒక వంటకమే తయారు చేశారు ఓ మాస్టర్ చెఫ్. అతను చేసిన ఆ వంట ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంత వైరల్ అవుతున్న ఆ వంట ఏంటి అసలు ఎవరు చేశారు ఇప్పుడు తెలుసుకుందాం.

పిజ్జా ఫారిన్ ఫాస్ట్ ఫుడ్ కావచ్చు కానీ ఇప్పుడు మనదేశంలో కూడా ఎంతో ఫేమస్ అయిన జంక్ ఫుడ్. ఇతర వంటకాల మాదిరిగానే పిజ్జాకు కూడా దేశీ తడ్కా ఇచ్చారు. పిజ్జాను చిన్నపిల్లలను మొదలు కుని పెద్దవారి వరకు ఎంతో ఇష్టంగా తింటారు. అయితే మీలో ఎవరైనా, ఎప్పుడైనా గులాబ్ జామూన్ పిజ్జా తిన్నారా ? ఆ పిజ్జా కూడా ఉంటుందా అనుకుంటున్నారా ప్రస్తుతం ఈ ఫిజ్జా కు సంబంధించిన రెసిపీ తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన పిజ్జా ప్రియులు పిచ్చెక్కిపోతున్నారు.

వైరల్ అవుతున్న వీడియోలో ముందుగా పిజ్జా బేస్ తయారు చేయడాన్ని చూడవచ్చు. దీని తరువాత దానికి గులాబ్ జామూన్ సిరప్ వేసి ఉడికించి, ఆపై గులాబ్ జామూన్ పగలగొట్టి పిజ్జా అంతటా వ్యాపింపచేశాడు. ఆ తర్వాత దాన్ని పూర్తిగా కాల్చి, చివరగా దానిపై నాలుగు గులాబ్ జామూన్లను ఉంచి సర్వ్ చేశారు. ఆ వీడియోని చూసిన నెటిజన్లు వివిధ రకాల కామెంట్లను చేశారు.

Read More..

నేడు భారీగా తగ్గిన చికెన్ ధరలు

Advertisement

Next Story

Most Viewed