Supreme court: చర్యలు తీసుకోవడంలో జాప్యమెందుకు.. ఢిల్లీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఫైర్

by vinod kumar |
Supreme court: చర్యలు తీసుకోవడంలో జాప్యమెందుకు.. ఢిల్లీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఫైర్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగిపోవడంపై సుప్రీంకోర్టు(Suprmeme court) తీవ్రంగా స్పందించింది. గాలి నాణ్యత పడిపోతున్నప్పటికీ గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) అమలులో ఎందుకు జాప్యం చేస్తున్నారని, ఢిల్లీ ప్రభుత్వం, కేంద్ర కమిషన్‌ని ప్రశ్నించింది. ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో కాలుష్యాన్ని అరికట్టేందుకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై న్యాయమూర్తులు అభయ్ ఎస్ ఓకా, అగస్టిన్ జార్జ్ మసిహ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. గాలి నాణ్యత సూచిక (ఏక్యూఐ) 300 నుంచి 400 మధ్య చేరినప్పుడు, స్టేజ్ 3 ఆంక్షలు విధించడంలో మూడు రోజులు ఎందుకు ఆలస్యం చేశారని మండిపడింది. ప్రస్తుతం ఢిల్లీలో దారుణ పరిస్థితులు ఉన్నాయని కాబట్టి వెంటనే జీఆర్‌పీ స్టేజ్ 4 అమలు చేయాలని ప్రభుత్వా్న్ని ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ నిబంధనలు సడలించొద్దని తెలిపింది. ఏక్యూఐ 400 కంటే తక్కువకు చేరినా దీనిని కొనసాగించాలని సూచించింది. అలాగే ఇప్పటి వరకు కాలుష్య నియంత్రణకు ఎటువంటి చర్యలు తీసుకున్నారో తెలియజేయాని ఢిల్లీ ప్రభుత్వానికి ఆర్డర్స్ జారీ చేసింది. కాగా, ఢిల్లీలో సోమవారం ఉదయం ఏక్యూఐ 483గా నమోదైంది.


Next Story

Most Viewed