లిప్‌బామ్స్ వాడేవారికి హెచ్చరిక.. అలాంటివి వాడితే సైడ్ ఎఫెక్ట్స్

by Sathputhe Rajesh |
లిప్‌బామ్స్ వాడేవారికి హెచ్చరిక.. అలాంటివి వాడితే సైడ్ ఎఫెక్ట్స్
X

దిశ, ఫీచర్స్: గాలిలో తేమ తగ్గినప్పుడు పెదవులు పొడిబారడం కామన్. ఈ సమయంలో మాయిశ్చరైజర్ యూజ్ చేస్తే సరిపోతుంది కానీ వీటిస్థానాన్ని లిప్ బామ్స్ ఆక్రమించాయి. అయితే మార్కెట్‌లో లభించే మెడికేటెడ్ లిప్ బామ్స్ ప్రతీరోజూ వాడడం ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు నిపుణులు. పెట్రోలేటమ్, మినరల్ ఆయిల్స్‌తో తయారయ్యే లిప్ బామ్స్‌ను దీర్ఘకాలం ఉపయోగించినప్పుడు, పెట్రోలియం ఆధారిత టాక్సిన్స్‌ సైడ్ ఎఫెక్ట్స్‌కు కారణమవుతాయని స్కిన్ స్పెషలిస్ట్స్‌ సూచిస్తున్నారు. కొన్ని కంపెనీలు మొక్కల ఆధారిత లిప్ బామ్స్ తీసుకొస్తున్నాయని, వీటి వినియోగం ఉత్తమమని సలహా ఇస్తున్నారు. కాగా పెదాల సంరక్షణలో సముద్రపు ఆల్గే పదార్థాలు కూడా ప్రధాన పోత్ర పోషిస్తాయని, నేచురల్ UV ప్రొటెక్టర్‌గా పనిచేసే మ్యాంగో టీ.. ఏ వాతావరణానికైనా తగినదని సూచించారు.

రకరకాల గాడ్జెట్స్ వాడకంతో జనాలు బ్లూ లైట్ ఎఫెక్ట్‌ను ఫేస్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రత్యేకమైన లిప్ డిటాక్స్ మాస్క్‌ ఉపయోగిస్తున్నాం. జెమ్ స్టోన్స్ నుంచి ఎక్స్‌ట్రాక్ట్ చేయబడిన ఈ పదార్థాలు కాలుష్య కారకాల నుంచి రక్షిస్తాయి. లిప్ సెన్సిటివిటీ కలిగిన కొంతమందికి అన్ని లిప్‌బామ్స్ సరిపడవు. ఇలాంటి వ్యక్తులు బురిటీ ఆయిల్ కంటెంట్ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ వాడాలి. రిచ్ మాయిశ్చరైజర్‌ను అందించే ఈ ఆయిల్.. ఇరిటేషన్, రెడ్‌నెస్‌ను ట్రీట్ చేయగలదు. ప్లాంట్ రెటినోల్‌గా పిలవబడే ఈ ఆయిల్‌లో 'విటమిన్ ఏ' అధికంగా ఉండటంతో యాంటీ ఏజింగ్ లక్షణాలు ఉంటాయి. ఇక ఇందులో చాక్లెట్ లేదా కోకో ఫ్లేవర్ బెటర్- కార్తీక్ బాలసుబ్రమణియన్, చర్మ నిపుణుడు

Advertisement

Next Story

Most Viewed