మొక్కజొన్న పీచుతో ఇలా చేసి కిడ్నీలో రాళ్లకు చెక్ పెట్టొచ్చు!

by Prasanna |   ( Updated:2023-08-16 14:33:47.0  )
మొక్కజొన్న పీచుతో ఇలా చేసి  కిడ్నీలో రాళ్లకు చెక్ పెట్టొచ్చు!
X

దిశ,వెబ్ డెస్క్: మనలో చాలా మంది మొక్కజొన్న ఇష్ట పడుతుంటారు. ముఖ్యంగా వర్షాకాలంలో వేడివేడిగా కాల్చిన మొక్కజొన్న ఎక్కువగా తింటుంటారు. వర్షాకాలంలో ఎక్కడ చూసినా కూడా మొక్కజొన్నలు అమ్మే బండ్లు కనిపిస్తుంటాయి. కాల్చిన మొక్కజొన్నకు కొంచెం ఉప్పు కారం పట్టించి వేడి వేడిగా తింటే ఆ టేస్ట్ చాలా బావుంటుంది. మొక్కజొన్న తినడం మన ఆరోగ్యానికి చాలా మంచిది. మొక్కజొన్న వలన మన ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అయితే మొక్కజొన్న మాత్రమే కాకుండా మొక్కజొన్న పీచు వల్ల కూడా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

మొక్కజొన్న పీచులో పొటాషియం, కాల్షియం, విటమిన్లు బి2, సి, కె వంటి పోషకాలు ఉంటాయి. మొక్కజొన్న పీచుతో టీ చేసుకుని తాగితే ఆరోగ్యానికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. మొక్కజొన్న పీచు కిడ్నీలకు సూపర్ మెడిసిన్ అని చెప్పుకోవచ్చు. ఇది కిడ్నీలలోని ప్రమాదకర టాక్సిన్స్‌ను తొలగిస్తుంది. ఈ టీ రోజు తాగితే.. కిడ్నీలో రాళ్లు రాకుండా నివారించవచ్చు. మొక్కజొన్న పీచులో యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. షుగర్‌ సమస్య ఉన్న వారు మొక్కజొన్న పీచు టీ తాగితే రక్తంలో షుగర్‌ స్థాయిలు అదుపులో ఉంటాయి.

Read More: ఈ పురుగులను ముట్టుకుంటే ప్రాణం గాల్లో కలిసిపోతుంది?

Advertisement

Next Story

Most Viewed